Friday, May 10, 2024

బిగ్‌ బాస్కెట్‌ గోదామ్‌లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

పుణెలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని బవ్‌ధాన్‌ బద్రుక్‌ ప్రాంతంలోని బిగ్‌ బాస్కెట్‌ గ్రాసరీ స్టోర్ గోదామ్‌లో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి స్టోర్ మొత్తం వ్యాపించడంతో గోదామ్‌లోని నగదుతోపాటు గ్రాసరీ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్‌ ఇంజన్ల సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Fire breaks out at Bigbasket godown in Pune

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News