Tuesday, May 7, 2024

దేశంలో మొదటి కొవిడ్ టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీ

- Advertisement -
- Advertisement -
First Covid Testing Mobile Laboratory in india
ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ : కరోనా పరీక్షలను సత్వరం నిర్వహించడానికి వీలుగా దేశం లోనే మొదటి సారి కొవిడ్ 19 మొబైల్ లేబొరేటరీ అందుబాటు లోకి వచ్చింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ గురువారం ఢిల్లీలో ఈ లేబొరేటరీని ప్రారంభించారు. ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ డయాగ్నస్టిక్స్ ల్యాబ్‌గా పిలిచే ఈ ల్యాబ్ నుంచి రోజుకు 50 ఆర్‌టి పిసిఆర్, 250 ఎలీసా పరీక్షలు, హెచ్‌ఐవి, క్షయ వంటి వాటికి కూడా పరీక్షలు చేయవచ్చని, రోజుకు దాదాపు 500 పరీక్షలు వరకు సాధ్యమౌతాయని తెలిపారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ లేబొరేటరీ తయారైందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మెడ్‌టెక్ జోన్ సహకారంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ దీన్ని రూపొందించింది.

first Covid Testing Mobile Laboratory in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News