Friday, April 26, 2024

గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

first danger warning to Godavari flood

భద్రాచలం వద్ద పెరుగుతున్న ఉధృతి,పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు, దిగువకు వదులుతున్న అధికారులు

మనతెలంగాణ/ హైదరాబాద్: భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. గోదావరిలో నీటిమట్టం 43.50 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరిలోకి 9,07,616 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. బుధవారం ఉదయం 30 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం రాత్రికి నలభై అడుగులకు చేరింది. గురువారం ఉదయం 6 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి 43. 50 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు కాలనీల ప్రజలు, లోతట్టు ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని జాలర్లు, రైతులు గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.

మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలు, వస్తోన్న భారీ వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3.30లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.49లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత 1087.4 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టిఎంసీలు కాగా ప్రస్తుతం 74.506 టిఎంసీల నీరు నిల్వ ఉంది.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మూడు రోజుల నుంచి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కరఘాట్‌ను ఆనుకొని వరద ఉధృతంగా వస్తోంది. 12.08 మీటర్ల ఎత్తులో 9,17,090 క్యూసెక్కుల నీరు లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్ వైపు నీరు తరలుతోంది. అదేవిధంగా అన్నారం (సరస్వతీ) బరాజ్ కు 5,74,910 క్యూసెక్కుల ఇన్ఫో వస్తుండగా, 62 గేట్లు ఎత్తి అంతేమొత్తం నీటిని అధికారులు దిగువ గోదావరి నదిలోకి వదులుతున్నారు. బరాజ్‌లో ప్రస్తుతం 02.23 టిఎంసీల నీరు నీల్వ ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News