Friday, May 3, 2024

విఠోబా ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఆషాడ మాసంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్బంగా రాష్ట్ర పశు సంవర్దక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉస్మాన్‌షాహీలోని జంగల్ విఠోబా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన ఆలయ కమిటి ఛైర్మెన్, జిహెచ్‌ఎ ంసి బిజెపి ఫ్లోర్ లీడర్ జి శంకర్‌యాదవ్, ఆలయకమిటీ అధ్యక్షులు వి కిషన్‌యాదవ్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇంచార్జి నందకిశోర్ వ్యాస్, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ ఉద్యమనేత ఆర్వీ మహేందర్‌కుమార్‌లతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి తలసానితో పాటు అతిథులను పూలమాల, శాలువాలతో ఘనంగా స న్మానించారు. అనంతరం విఠలేశ్వర, రుక్మాబాయిల ఉత్సవ మూర్తులను శేష వాహనంపై ఆసీనం గావించి, రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కా ర్యమ్రంలో మా జీ కార్పోరేటర్ ఎం రాంచందర్ రాజు, వై కృష్ణ, బీఆర్‌ఎస్ నేతలు ఆనంద్‌కుమార్ గౌడ్, ఆల పురుషోత్తంరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పి మా ణిక్‌రావు, ఆలయ కమిటీ కోశాధికారి, గోల్కొండ జిల్లా బిజెపి అధ్యక్షులు వుఫ్కెల పాండుయాదవ్‌లతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News