Friday, April 26, 2024

పోరుశంఖం

- Advertisement -
- Advertisement -

First step in united struggle over counter:CM KCR

కేంద్రంపై ఐక్య పోరాటంలో తొలి అడుగు

సమూల మార్పు లక్షంగా విపక్షాల ఐక్యత ఆ ఇదే తొలి అడుగు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు
సాగుతాం అందరి సహకారంతో కేంద్రంపై కలిసి పోరాడుతాం ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతాం మున్ముందు మరింత పురోగతి
ఉంటుంది దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కేంద్ర సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది వైఖరి మార్చుకోకపోతే బిజెపికి ఇబ్బందులు
తప్పవు కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మార్పులు రావాలి 75ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా దేశానికి అనేక సమస్యలున్నాయి కారణం కేంద్రం నిర్లక్షమే
కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేసేందుకు హైదరాబాద్‌కు రావాలని ఉద్ధవ్‌థాక్రేను ఆహ్వానించాను త్వరలోనే అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలతో సమావేశమై
భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం శివాజీ, బాల్‌థాక్రే స్ఫూర్తితో పోరాడుతాం తెలంగాణ, మహారాష్ట్ర సదవగాహనతో
ముందుకు నడవాలి : ముంబైలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో చర్చల అనంతరం మీడియాతో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్

దేశానికి కెసిఆర్ అవసరం : పవార్

దేశాన్ని అనేక సమస్యలు పీడిస్తున్నాయి నిరుద్యోగం, ఇంధన ధరలు.. ఇంకా చెప్పుకుంటూపోతే
చాలా ఉన్నాయి తెలంగాణలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి దేశానికి
కెసిఆర్ వంటి నేతల అవసరం అందుకే ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం

ప్రతీకార రాజకీయం నడుస్తోంది : థాక్రే

జాతీయ రాజకీయాలపై కెసిఆర్‌తో చర్చించా దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై మాట్లాడాం
ఆరంభం మాత్రమే మున్ముందు పురోగతి వస్తుంది విధానపరమైన మార్పుల కోసం పోరాడుతాం తెలంగాణ,
మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు అన్ని అంశాలపై మా మధ్య ఏకాభిప్రాయం వచ్చింది

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో సమూల మార్పే లక్షంగా విపక్షాల మధ్య ఐక్యత సాధన కోసం తొలి అడుగు మహారాష్ట్రలో పడిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నరేంద్రమోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీల న్నింటినీ ముందుకు సాగుతామన్నారు. అందరి సహకారంతోనే కేంద్రంపై సంయుక్తంగా పోరాటం చేస్తామన్నారు. ఇందుకు తొలి అడుగుగా మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఈ సమావేశమన్నారు. ఈ విషయం లో మునుముందు మరింత పురోగతి ఉంటుందన్నారు. కేంద్రంపై పోరాటం చేసేందుకు త్వరలోనే ఒక కార్యాచరణను రూపొందిస్తామని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆహ్వానం మేరకు ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానా శ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆయనతో టిఆర్‌ఎస్ ఎంపిలు జో గినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, బిబి పాటిల్, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్ తది తరులున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌థాక్రే నివాసానికి సిఎం కెసిఆర్ బృందం చేరుకుంది. థాక్రేతో కలిసి సిఎం కెలిసి లంచ్ చేసిన అనంతరం జాతీయ రాజకీయాలపై చర్చ కొనసాగించారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనపై పోరాటం చేయాలని కలిసి నిర్ణయించారు.

ముంబైలోని సిఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాలో జరిగిన ఈ భేటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లా డుతూ రాజకీయాలపై మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రేతో చర్చించినట్లు తెలి పారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఇందుకు ముంబై వేదిక గా అడుగులు వేస్తున్నామన్నారు. సంస్థలను సర్కార్ గం చేస్తోందని విమర్శించారు. వైఖరి మార్చుకోకుంటే బిజెపికి ఇబ్బందులు తప్పవని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ హెచ్చరించారు. ఇంకా అనేక ప్రాం తీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఇందుకు సంబం ధించిన కార్యాచరణ, చర్చలు ఈరోజే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర,- రాష్ట్ర సంబంధాల్లో మార్పు రావాలని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇందుకు కేంద్రం నిర్లక్షమే కారణ మని మండిపడ్డారు. కేంద్రంపై పెద్దఎత్తున పోరాటం చేసేందుకు తగు కార్యా చరణ ప్రణాళికలపై కసరత్తు చేసేందుకు ఒకసారి హైదరాబాద్‌కు రావాలని థాక్రేను ఆహ్వానించినట్లు వెల్లడించారు.

దేశానికి బిజెపి, కాంగ్రెస్సేతర ప్ర త్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కావల్సిన అవసరం ఎంతైనా ఉందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో అతిపెద్ద పరివర్తన రావాల్సి ఉందన్నారు. దేశ యువతను సరైన దిశలో ముందకు తీసుకెళ్లాలి. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాల్లో కలిసి కట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ చర్చలు ఆరంభం మాత్రమేనన్న కెసిఆర్… మున్ముం దు మరింత పురోగతి వస్తుందన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామన్నారు. శివాజీ, బాల్ ఠాక్రే వంటి యోధుల స్ఫూర్తితో రా బోయే రోజుల్లో పోరాడుతామన్న కెసిఆర్.. పటిష్టమైన దేశం కోసం అందరూ కలిసి రావాలన్నారు.

దేశంలో గుణాత్మకమైన మార్పు అవసరం. అన్ని విష యాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. రాబోయే రోజుల్లో కలిసి పని చే యాలని నిర్ణయించామన్న కెసిఆర్….. త్వరలో హైదరాబాద్ లేదా మరో చోట నేతలమంతా కలుస్తామన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో తెలంగాణ స్వరూపం మారిపోయిందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దు 1000 కిలోమీటర్లు ఉందన్నారు. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది ఆరంభం మాత్రమే

జాతీయ రాజకీయాలపై కెసిఆర్‌తో చర్చించినట్లు మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే, మున్ముందు పురోగతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చర్చల్లో రహస్యమేమీ ఉండదని, దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయం నడుస్తోందని ఆరోపించారు. ప్రతీకార రాజకీ యాలు దేశానికి మంచిది కాదని హితవు పలికారు. దేశంలో విధాన పరమైన మార్పుల కోసం పోరాడుతామని తెలిపారు. మార్పులు రావాల్సి ఉం దని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఏ ఉద్యమం ప్రారంభమైనా విజయవంతమైందన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి తోనే ముందు కెళ్తామని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. సిఎం కెసిఆర్ బృందం ముంబై నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News