Sunday, May 5, 2024

పేదల కడుపు నింపుతున్న ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎ. సుంకె రవిశంకర్

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వలసకూలీలకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా నిత్యఅన్నదానం చేస్తూ మరోసారి ప్రజలందరికి ఆదర్శం అయ్యారని శాసన సభ్యుడు సుంకె రవిశంకర్ కొనియాడారు. బుధవారం కరీంనగర్ బోయినపల్లి మండలం, కొదరుపాక గ్రామంలో ఎంపి సంతోష్‌కుమార్ నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమాన్ని శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ ప్రారంభించారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు సంతోష్ చేస్తున్న నిత్య అన్నదానంతో వలస కూలీలు పేదప్రజలు, రైతుకూలీలకు భోజన సౌకర్యం ఏర్పడిందని సంకె రవిశంకర్ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనికోసం వచ్చిన వలస కూలీలకు ఎంఎల్‌ఏ భోజనం వడ్డించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వలసకూలీలకు ప్రతిఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదు ఇస్తోందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంతోష్‌కుమార్ తమ చొప్పదండి నియోజకవర్గం బిడ్డ కావడం గర్వంగా ఉందన్నారు. వలస కూలీలు ఆకలితో అలమటించకుండా అన్నదానంతో తన దాతృత్వాన్ని చాటుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి ఛైర్మన్ ఉమాకొండయ్య, ఎంపిపి వేణుగోపాల్, ఎంఆర్‌ఒ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు రెండు నుంచి మూడువేల మంది వలస కార్మికులు భోజనం చేసి సంతోష్‌ను దీవించారని చెప్పారు.

 

Food distribute by MP Santhosh Kumar in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News