Friday, April 26, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు ‘ఫోర్బ్స్’ ప్రశంస

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండి యా ఛాలెంజ్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత ‘ఫోర్బ్’ మ్యాగజైన్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌బిల్డింగ్ బెటర్ టుమారో’ పేరి ట ప్రత్యేక వ్యాసాన్ని డిసెంబర్ సంచికలో ప్రచురించింది. ప్రముఖ నటుడు, బాహుబలి హీరో ప్రభాస్‌తో కలిసి ఎంపి జోగినపల్లి గ్రీన్ ఇండియా ఛా లెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను కూడా ఆ వ్యాసంలో పొందుపరిచింది. ‘ఎవరైతే మొక్కను నాటుతారో వారు వి శ్వాసాన్ని పాదుకొల్పుతున్నట్టు’ అని అమెరికా కవి లూసీ లార్కర్ 19వ శతాబ్ధంలో చెప్పిన మాటతో వ్యాసాన్ని ప్రారంభించిన ఫోర్బ్.. భారత పార్లమెంట్ ఎగువసభ ఎంపి సంతోష్‌కుమార్ తీసుకు న్న ఈ కార్యక్రమం లక్షల మందికి స్ఫూర్తినివ్వడ మే కాకుండా హరిత యజ్ఞంలో భాగస్వాములయ్యేలా చేసిందని ప్రశంసించింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం స్ఫూ ర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్(జిఐసి) వ్యవస్థాపకుడు సంతోష్ చెట్లు నాటడమే కాకుండా నాటిన వాళ్లు మరికొంత మంది స్నేహితులను..సెలెబ్రిటీలను, బంధువులను ఇలా సమాజం మొత్తాన్ని భా గస్వాములయ్యేలా చేసిందని పేర్కొంది. కీసరలో అడవిని దత్తత తీసుకుని 2వేలకు పైగా ఎకరాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా తద్వారా ‘గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్’కు శ్రీకారం చుట్టి కార్యక్రమాన్ని కొత్త పుంతలు తొక్కించారని ఫోర్బ్ పొగడ్తల వర్షం కురిపించింది. ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ను బాహుబలి స్టార్ ప్రభాస్, హెటిరో ఫార్మా కంపెనీ, ప్రముఖ నటుడు నాగార్జున అడవులను దత్తత తీ సుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. అదే విధంగా సంతోష్ తీసుకువచ్చిన వృక్ష వేదం పుస్తకం ప్రాముఖ్యతను కూడా ఫోర్బ్ కొనియాడింది.

వేదాలు, పురాతన గ్రంధాల్లో వివి ధ రకాల వృక్షాలకు ఉన్న ప్రాముఖ్యతను, వాటి ఉపయోగాన్ని వివరించడమే కాకుండా.. కొన్ని మూలికలతో కూడిన చెట్లు మానవాళిక ఏ విధంగా ఉపయుక్తమవుతున్నాయో వివరించిన తీరును ప్ర స్తావించింది. కోటి వృక్షార్చన, విత్తన బంతులు తదితర కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అడవుల అభివృద్ధికి ఎంపి సంతోష్ చేసిన కృషిని ఫోర్బ్ ప్రశంసించింది.

గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. ఫోర్బ్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్ ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా కథనాన్ని ప్రచురించడం గౌరవంగా భావిస్తున్నా. ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ కార్యక్రమం కూడా విజయానికి నోచుకోదు. అలాగే గ్రీన్ ఇం డియా చాలెంజ్‌ను కూడా ప్రపంచ వ్యా ప్తంగా ఎంతో మందితో భవిష్యత్ తరాలకు మార్గదర్శకమైంది. ఇది తనకు ఎత్తో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తోంది.

                                                                  ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News