Friday, May 10, 2024

కాటేదాన్‌లో చిరుత.. 4 డ్రోన్ కెమెరాలతో కొనసాగుతున్న గాలింపు చర్యలు

- Advertisement -
- Advertisement -

Leopard

హైదరాబాద్‌: ఎనిమిది గంటల నుంచి చిరుత కోసం అటవీ అధికారులు అపరేషన్ కొనసాగిస్తున్నారు. 20 ట్రాప్ కెమెరాలు, 4 డ్రోన్ కెమెరాలతో వెతికినా ఇంత వరకు చిరుత ఆచూకి దొరకలేదు. దీంతో అధికారులు పది కుక్కలను అడవిలోకి పంపడంతోపాటు రెండు మేకలను ఎరగా వదిలారు. గురువారం ఉదయం కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై పడుకొని ఉన్న చిరుతను చూసి స్థానికులు అటవీ అధికారలుకు సమాచారం అందించారు. అయితే, అధికారులు చేరుకునేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాటేదాన్‌, బుద్వేల్‌ వాసులు బయటకు రావొద్దని సూచించారు. చిరుత స్థానికంగా ఉన్న తోటలో నక్కినట్లు అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Forest Officers Search for Leopard at Kattedan in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News