Friday, May 3, 2024

పాలన సౌలభ్యం కోసమే చిన్న గ్రామపంచాయతీల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

ముత్తారం: గ్రామీణ ప్రాంతాలలో పాలన సౌలభ్యం కోసం చిన్న గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తెలిపారు. గురువారం హరిపురం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనంను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లా డుతూ హరిపురం గ్రామస్తుల కోరిక మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం ద్వారా రూ.20 లక్షల రూపాయల నిధులతో గ్రామపంచాయతీ భవన నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.

హరిపురం గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో నడుస్తుం దని ఈ సందర్భంగా సర్పంచ్ వేల్పూరి సంపత్‌రావును అభినందించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటా యించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో కనీస మౌళిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్య క్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలకల స్వర్ణలత అశోక్ కుమార్, వైస్‌ఎంపీపీ సుదాటి రవీందర్ రావు, బీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి, సర్పంచ్‌ల ఫోరం మండల కన్వీనర్ నూనె కుమార్, ఎంపీటీసీ బియ్యని శ్యామలతోపాటు సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News