Wednesday, May 8, 2024

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Juvvadi-Ratnakar, Former minister Juvvadi Ratnakar passed away

కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ ‌లోని తన ఇంట్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం ఆయన స్వస్థలం. రత్నాకర్ గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఓ దశలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బుగ్గారం నుంచి మూడుసార్లు ఎంఎల్ఎగా గెలిచారు. 2009 ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జువ్వాడి మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

Former minister Juvvadi Ratnakar passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News