Friday, May 3, 2024

స్టార్ గురులో ఉచిత ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం షురూ

- Advertisement -
- Advertisement -

Free Online Learning Platform at Star Guru

హైదరాబాద్: విద్యార్ధులు ఉత్త మ విద్యనభ్యసించేందుకు ఆర్థిక భారం కాకూడద ని స్టార్ గురు యాప్ ఉచిత ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాంను ప్రారంభించినట్లు బుధవారం ఆ యాప్ ప్రతినిధులు ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో సిలబస్‌కు అనుగుణంగా ప్రమాణికమైన ఆన్‌లైన్ వీడియో పాఠాలను నేర్చుకునే వెసులుబాటును కల్పించినట్లు పేర్కొన్నారు. అంతేగాక అన్ని సబ్టెక్టులకు సంబంధించిన డిజిటల్ పాఠాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధానంగా 6 నుంచి పది తరగతి చదివే విద్యార్ధులకి ఉపయోగపడే లెక్కల పాఠాలు మిక్కిలిగా ఉన్నాయన్నారు. సాధారణంగా గురువుల భోదన, పిల్లల అభ్యసనలో వైవిధ్యం ఉంటుందని, కానీ ఈ స్టార్ గురుయాప్‌లో ప్రతి విద్యార్ధి బాగా నేర్చుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు.

సమగ్రపాఠాలు, మంచి బోధన పద్దతుల పునాదులపైస రూపొందించిన వీడియోలు విద్యార్ధుల ఉన్నతికి సహకరిస్తాయన్నారు. దీంతో పాటు పరీక్షల సన్నద్ధత కోసం లైవ్ తరగతులను కూడా నిర్వహిస్తామని ఆ యాప్ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో పాటు లైవ్ చాట్ విధానంలో విద్యార్ధులు ఉపాధ్యాయులతో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీంతో పాటు ఉపాధ్యాయులు ఈ ఆన్‌లైన్ వేదిక ద్వారా తమ విద్యార్ధులు పైసా ఖర్చు లేకుండా ఆ యాప్ ద్వారా చేరువకావచ్చన్నారు. www.starguru.org లో లాగిన్ అయి మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చన్నారు. ఇది లా ఉండగా స్టార్ గురు డిజిటల్ విద్య యాప్‌కి పునాది ప్రగ తి శీల ఉపాధ్యాయులు కావడం గమనార్హం. అలాంటి ఉత్తమ, సృజనాత్మక ఉపాధ్యాయుల ప్రతిభాపాటవాల ప్రదర్శనకి స్టార్‌గురు ఓ చక్కని వేదిక కాబోతుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News