Monday, May 6, 2024

నల్లాకు మీటర్ లేకుంటే ఉచిత సరఫరా కట్…

- Advertisement -
- Advertisement -

Free supply cut if Water tap does not have Meter

ఆగస్టు 15 వరకు బిగించుకోవాలని బోర్డు సూచనలు
గడువులోగా ప్రక్రియ చేయకుంటే 09 నెలలు బిల్లు చెల్లించాల్సిందే
ఇప్పటివరకు 5.6లక్షల కనెక్షన్లకు అనుసంధానం పూర్తి
ముందుకురాని బహుళ అంతస్తుల వినియోగదారులు 

హైదరాబాద్ : నగరంలో జలమండలి ఉచిత నీటి పథకం లబ్దిదారులు అధార్ అనుసంధానం, మీటర్లు బిగింపు ఆగస్టు 15లోగా ప్రక్రియ పూర్తి చేయకుంటే ఉచిత నీటి సరఫరా ఉండదని బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. గడువులోగా మీటర్లు ఏర్పాటు చేయకుంటే డిసెంబర్ నుంచి ఆగస్టు నెలవరకు 09 నెలల బిల్లులు రూ. 5400 చెల్లించాల్సింది వస్తుందని పేర్కొంటున్నారు. జూలై 01వ తేదీ నుంచి రెండోసారి గడువు పెట్టి నగర వాసులు ఆశించిన స్దాయిలో ముందుకు రాలేదంటున్నారు. నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లో ఆశించిన స్దాయిలో ముందుకు రాలేదని వెల్లడిస్తున్నారు. బోర్డు పరిధిలో 10. 8లక్షలు ఉండగా, ప్రస్తుతం 5.6లక్షలు కనెక్షన్లు అనుసంధానం చేసుకోగా, 4.4 లక్షల మంది ప్రక్రియ పూర్తి చేసు కోలేదు. వీరికి సమయం 10 రోజుల ఉందని, వీలైనంత త్వరగా అధికారులు సూచించిన విధంగా అధార్ అనుసంధానం, మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని డివిజన్ మేనేజర్లు కోరుతున్నారు.

స్లమ్ కాలనీలో జలమండలి అధికారులు మీటర్ రీడర్లు ఏర్పాటు చేసి వారి ద్వారా ఉచితంగా ఆధార్ అనుసంధానం చేశారు. డొమెస్టిక్ వినియోగదారులు కూడా 80శాతం మంది ముందుకు రాగా, బహుళ అంతస్తులో ఉండే వినియోగదారులు ముందుకు రావడంలేదంటున్నారు. లైన్‌మెన్లు అపార్టుమెంట్లు ప్లాట్లు తిరిగి చెప్పిన రేపుమాపు చేస్తామంటూ నిర్లక్ష వహిస్తున్నారని మండిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మీటర్ కలిగిన బల్క్, ఎంఎస్టీ వినియోగదారులు ప్లాట్ వారీగా తమకు జీహెచ్‌ఎంసీ జారీ చేసిన పిటిఐఎన్ నంబర్ నమోదు చేసుకుని, ఆదార్‌లింక్‌ను గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఒక గృహ సముదాయంలో ఎన్ని ప్లాట్‌ల యాజమానులు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేశారో వారికి మాత్రమే 20వేల లీటర్ల వరకు రిబేటు లభిస్తుందని, ఆధార్ అనుసంధానం చేయని ప్లాట్ యాజమానులకు యథావిధిగా బిల్లు జారీ చేయడం జరుగుతుందన్నారు.

ఆగస్టు 15 తరువాత కూడా పథకాన్ని పొందవచ్చని, వారికి 2020 డిసెంబర్ నెల నుంచి 31 ఆగస్టు 2021 వరకు నీటి బిల్లులు జారీ చేస్తామని చెప్పారు. కానీ వీరికి ఎలాంటి వడ్డీ, జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదని, వినియోగదారులు ఈబిల్లులను సెప్టెంబర్‌లో చెల్లించాలని పేర్కొన్నారు. జలమండలి ప్రతి డివిజన్‌కు 2 ఏజెన్సీల చొప్పన 15ఎంఎం, 20ఎంఎం సైజు మెకానికల్ మీటర్ల సరఫరా, మీటర్ బిగింపు కోసం 24 ఏజెన్సీలు బాధ్యతలు అప్పగించి మీటర్లను అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. 15ఎంఎం మీటర్ ధర రూ. 1498లు, 20ఎంఎం సైజు రూ. 2147లు చెల్లించి మీటర్లు బిగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతినెల 20వేల లీటర్ల లోపు వాడిని వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు. నీటి వినియోగం నెలకు 20వేల లీటర్లకు మించితే అదనపు వినియోగానికి బోర్డు టారిప్ ప్రకారం బిల్లు చెల్లించాలని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News