Friday, April 26, 2024

అమెరికాలో శీతల తుఫానుకు 34 మంది మృతి!

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా అంతటా మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 34 మంది ప్రాణాలను బలిగొన్నది. హిమపాతం, విద్యుత్ అంతరాయం కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ మంచు తుఫాను కెనడాకు సమీపంలోని గ్రేట్ లేక్స్ మొదలుకొని రియో గ్రాండే వరకు మెక్సికో సరిహద్దు అంతటా వ్యాపించి ఉంది. జనాభాలో దాదాపు 60 శాతం మంది ఏదో రకంగా ప్రభావితమయ్యారు. ఇక ప్రయాణికుల కష్టాలకైతే అంతే లేదు. ఆదివారం దాదాపు 1707 డొమెస్టిక్ ఫ్లయిట్స్, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని ఫ్లయిట్ అవేర్ తెలిపింది. రోడ్లపై కారులైతే ఆరు అడుగుల మంచులో కూరుకుపోయాయి. విద్యుత్తు లేకపోవడం వల్ల చాలా మంది చీకటిలోనే గడపాల్సి వస్తోంది. సోమవారం గంటకు 40 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాను సమయంలో రెండు లూటీ ఘటనలు జరిగాయని పోలీసులు తెలిపారు. న్యూయార్క్‌లోని చీక్టోవాగా శివార్లలో ఇద్దరు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News