Saturday, April 27, 2024

ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. కార్‌‌ రేసింగ్ పోటీలతో మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకూ కార్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌‌ మార్గ్, నెక్లెస్ రోడ్స్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులులో వుంటాయని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్ క్లోజ్ చేస్తారు.

బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు నో ఎంట్రీ

రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు.

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్,ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలకు నో ఎంట్రీ

ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే రోడ్స్ క్లోజ్

బీఆర్‌ె్కఆర్‌‌ భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు.

ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్,నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్

ఎన్టీఆర్ గార్డెన్, ఎన్‌టీఆర్‌‌ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్లు మూసివేత

కాగా, హైదరాబాద్‌లో ఫార్ములా- ఈరేసింగ్ పోటీలు ఇటీవల జరిగాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా- ఈ రేసు హైదరాబాద్ లో నిర్వహించారు. రేసింగ్ ట్రాక్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. అయితే వివిధ కారణాల వల్ల నవంబర్ 19,20 తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లు రద్దు చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి లీగ్ రౌండ్ లో భాగంగా ప్రాక్టీస్ చేస్తుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News