Monday, May 6, 2024

ఇంటింటికీ సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకంగా పంపిణీ

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకంగా అందుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో శరవేగంగా దళిత బంధు, బిసి బంధు, గృహ లక్ష్మిపథకాలు మూడు నెలల్లో పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు.ప్రజాలకు సేవలందించేందుకు 24 గం. అందుబాటులో ఉంటున్నానన్నారు. దళిత బంధు ద్వారా రూ. 10 లక్షలు అందిస్తూ వారి జీవనోపాధికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రెండవ విడతగా 1100 యునిట్లు మంజూరైయ్యాయన్నారు.కుల వృత్తులు నమ్ముకొని జీవిస్తున్న వారికి బిసి బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 1722 మందిని గుర్తించామన్నారు.విడుతల వారిగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు.సొంత ఇంటి స్థలం ఉన్న పేదలకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందనుందన్నారు.ప్రభుత్వ స్థలాలను గుర్తించి అర్హులైన పేదలకు 75 గజాల ఇంటి స్థలాలను ఇంచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసిందని చెప్పారు.నియోజకవర్గ వ్యాప్తంగా 40 వేలకు పైగ -డబుల్ బెడ్‌రూం ఇళ్లులు పూర్తి అయ్యాయన్నారు.నియోజక వర్గ వ్యాప్తంగా యువతీ,యువకులు ఉచితంగా స్వంత నిధులతో డ్రైవింగ్ లైసేన్స్ ఇప్పించనున్నట్టుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల ఫేన్షన్ రు. 3 వేల నుంచి 4 వేలకు పెంచడం జరిగిందన్నారు.

స్థానిక జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్య త్వరలోనే పరిష్కరిస్తున్నట్టుగా చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపే ప్రతి పథకాన్ని అమలైట్టేగా చూడాలని అధికారులను ఆదేశించారు.దేశంలోనే మొట్టమొదటి సారి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మణ్ ప్రభాకర్, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్, సింధు ఆదర్శ రెడ్డి, పుష్పనగేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News