Monday, May 6, 2024

శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

- Advertisement -
- Advertisement -
Ganesh festivals should be celebrated peacefully
వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: వినాయకుడి ఉత్సవాలను శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. వినాయక చవితి బందోబస్తు, ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని కురుస్తున్న వర్షాల వల్ల వినాయకుడి నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 36 చెరువుల వద్ద జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్లు సరిపడా క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

లైట్లు, రోడ్లు మరమ్మత్తు పనులు, శానిటైజేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిమజ్జనానికి వచ్చే వారితో పోలీసుల మర్యాదగా మెలగాలని, శాంతిభద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులతో నిత్యం సమన్వయం చేసుకోవాలని అన్నారు. డయల్ 100కు వచ్చే కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అన్నారు. సిసిటివిలు అన్ని పనిచేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అందురూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. చెరువుల వద్ద నీటి వసతి, హ్యాలోజెన్ లైట్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశామని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు.

కూకట్‌పల్లి ఐడిఎల్ చెరువు, సున్నం చెరువుల వద్ద ఏడు క్రేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అగ్నిప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ప్రగతి నగర్ చెరువులో నీటి మట్టం తక్కువగా ఉందని, పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యామ్నాయం చూపాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కోరారు. దీంతో పెద్ద వినాయకుడి విగ్రహాలను ఐడిఎల్ చెరువులో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఫైర్, వివిధ శాఖ అధికారులు, బాలానగర్, మాదాపూర్ డిసిపిలు పద్మజా, వెంకటేశ్వర్లు, ఎసిపిలు, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్, భాగ్యనగర్ ఉత్సవ సమితీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, సెక్రటరీ భగవంత్‌రావు, విహెచ్‌పి ప్రెసిడెంట్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News