Monday, April 29, 2024

సైంటిస్టు హానిట్రాప్ యువతి గ్యాంగ్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gang that trapped Scientist has been arrested

 

నోయిడా : భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్‌డిఒకు చెందిన 35 ఏండ్ల సైంటిస్టు హానీట్రాప్‌లో పడ్డారు. ఈ వ్యక్తి స్థానిక ఓయో హోటల్‌లో ఐదుగురు వ్యక్తులతో దాదాపుగా ఒక్కరోజు బందీగా ఉండాల్సి వచ్చింది. ఈ గ్యాంగ్ ఈ సైంటిస్టును బందీ చేసి విడుదలకు రూ పది లక్షలు డిమాండ్ చేసింది. ఓ యువతిని పావుగా వాడుకుని ఈ సైంటిస్టును ఈ గ్యాంగ్ బందీ చేసింది. యువతి మాటలు చేష్టలకు ఆకర్షితుడైన ఈ సైంటిస్టు చివరికి ఈ గ్యాంగ్ చేతబడినట్లు వెల్లడైంది. నోయిడాలో వ్యక్తుల అపహరణలు అసాధారణం ఏమీ కాదు.

అయితే అత్యంత కీలకమైన రక్షణ భద్రతా వ్యవస్థ అనుబంధపు డిఆర్‌డిఒ సైంటిస్టు బందీ కావడం సంచలనానికి దారితీసింది. ఓ యువతి తనను తాను సునీత గుర్జార్ బబ్లీవాసిగా పేర్కొంటూ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుంది. స్థానిక బిజెపి మండల్ నాయకిని అని కూడా తెలియచేసుకుంది. తాను బిగ్‌బాస్ షోలో కూడా కొద్ది సేపు పాల్గొన్నట్లు తెలిపిన సునీత యాక్టర్ సల్మాన్ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోలను కూడా పెట్టింది ఈ యువతి ద్వారా సైంటిస్టును గ్యాంగ్ ప్రలోభపెట్టి చివరికి కిడ్నాప్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ యువతి సహా ముగ్గురిని ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేశారు. ఈ సైంటిస్టు వివరాలు కేసు ఇతరత్రా పూర్వాపరాలు వెల్లడికాలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News