Tuesday, April 30, 2024

రాష్ట్రంలో ఘనంగా తొలి ‘గే’ వివాహం

- Advertisement -
- Advertisement -

Gay couple get Married in Telangana

వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు పురుషులు
ఎనిమిదేళ్లుగా సహజీవనం
గే జంటను ఆశీర్వదించిన ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ
గే జంటకు నటి సమంత అభినందనలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 8న గే జంట ఘనంగా వివాహం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎనిమిదేళ్ల పాటు సహజీవనం చేస్తున్న సుప్రీయో చక్రవర్తి, అభయ్‌డాంగ్‌లు వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, ట్రాన్స్‌జండర్ మహిళలు, సన్నిహితులతో పాటు ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీ వాళ్లు హాజరై గే జంటను ఆశీర్వదించారు. కాగా దేశంలో ఇప్పటివరకు పలు చోట్ల లెస్బియన్, గే పెళ్లిళ్లు జరిగాయి. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఇద్దరు నూతన వరుల వివాహానికి చట్టబద్ధత లేకపోవడంతో వివాహాన్ని రిజిస్టర్ చేసుకోలేదని కొత్త జంట తెలిపారు. బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల సుప్రియో చక్రవర్తి హైదరాబాద్‌లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు.

అలాగే పంజాబ్‌కు చెందిన 34 ఏళ్ల అభయ్ ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు. సుప్రియో, అభయ్‌లకు తాము గే’లమని వాళ్లకు చిన్నతనంలోనే తెలిసిందని, వీళ్లిద్దరికి 8 ఏళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడటంతో అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. వివాహ వేడుక సందర్భంగా సుప్రియో, అభయ్‌లు ఒకరి పేరు మరొకరు చేతుల్లో మెహందీతో రాసుకుని వివాహానికి విచ్చేసిన అతిధులకు చూపించి ఫోటోలు దిగారు. ఈ నేపథ్యంలో ఈ పురుష (గే) జంట ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని వెంటనే వారి నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గే జంట పెళ్లి చర్చనీయాంశమైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా వీళ్ల పెళ్లికి మద్దతివ్వడంతో పాటు అభినందనలు తెలుపుతూ గే జంట చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News