Home తాజా వార్తలు ముంపు బారిన 37,000 కుటుంబాలు

ముంపు బారిన 37,000 కుటుంబాలు

GHMC actions for normal conditions in Flooded areas

 

వరద బాధిత ఫ్యామిలీలకు సిఎం రిలీఫ్ రేషన్ కిట్
ఇప్పటికే 20వేల మందికి అందజేత
మధ్యాహ్నం 90వేలు, సాయంత్రం 60 వేల మందికి ఉచితంగా భోజనాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతా ప్రజలను అప్రమత్తం చేసి ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీల్లోని 35,309 కుటుంబాలు ముంపునకు గురైనట్లు చెప్పారు. గుర్రం చెరవు నీరు వచ్చే అవకాశముందని శనివారం సాయంత్రమే రెండు వేల కుటుంబాలను ముందస్తుగా ఖాళీ చేయించామన్నారు. మొత్తం 37 వేల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యారని, బాధిత కుటుంబాలకు సిఎం రేషన్ కిట్, మూడు బ్లాంకెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేస్తున్నామని, ఇప్పటివరకు 20 వేల రేషన్ కిట్స్, బ్లాంకెట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన రేషన్ కిట్స్ బ్లాంకెట్స్‌ను పంపిణీ చేశామన్నారు. వదర ప్రాంతాల్లోని కుటుంబాలకు పాలు, బ్రెడ్, బిస్కెట్లను అందజేస్తున్నట్లు వివరించారు. మధ్యాహ్నం 90 వేలు, సాయంత్రం 60 వేల భోజనాలు రెగ్యులర్ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు వరద ప్రాంతాల్లో ప్యాకింగ్ చేసి ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

మ్యాన్‌హోల్స్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించండి

వర్షాల నేపథ్యంలో సీవరేజీ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. జలమండలి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. రహదారులపై మ్యాన్ హోల్స్ ఓవర్ ఫ్లో సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సేవలు అందించే విధంగా 700 మందిని నియమించుకోవడానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కలుషిత నీటితో ప్రజలు ఇబ్బంది పడకుండా మంచినీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు చేసినట్లు తెలిపారు. కలుషిత నీరు ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాని ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాలకు నీటి ట్యాంకర్‌ల ద్వారా సరఫరా చేయాని సూచించారు. పునరావాస ప్రాంతాల్లో వాటర్ పాకెట్స్ ద్వారా తాగునీరు అందించాలని సూచించారు.