Saturday, April 27, 2024

ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ గులాం కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Ghulam Mustafa Khan passes away

న్యూఢిల్లీ: ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89) కన్నుమూశారు. ఆదివారంనాడిక్కడి బాంద్రా నివాసంలో ముస్తఫా మరణించినట్లు ఆయన కోడలు నమ్రతా గుప్తా ఖాన్ మీడియాకు వెల్లడించారు. ఉదయం ఆరోగ్యంగానే ఉన్న ఖాన్ కాసేపటికే విరేచనాలు చేసుకున్నారని, వెంటనే వైద్యులను సంప్రదించామని, డాక్టర్లు వచ్చే సరికే తుదిశ్వాస విడిచారని వివరించారు. ఖాన్ మరణంతో కుటుంబ సభ్యులం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యామని నమ్రత వాపోయారు. ఖాన్ 1931లో యుపిలోని బదౌన్‌లో జన్మించారు. తండ్రి నుంచి సంగీత పాఠాలు నేర్చుకున్న ఉస్తాద్ గులామ్ 1991లో పద్మశ్రీ పురస్కారం, 2006లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 2003లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఆయనను వరించింది. ఉస్తాద్ మృతికి సంగీత ప్రపంచం నివాళి అర్పించింది. ప్రముక గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ తదితరులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉస్తాద్‌ను ‘ప్రియమైన గురువు’గా రెహమాన్ అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News