Friday, April 26, 2024

ఆస్ట్రాజెనెకా టీకాకు పాక్ గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

Pakistan says it has approved Astrazeneca vaccine

 

ఇస్లామాబాద్: అత్యవసర వినియోగానికి ఆక్స్‌ఫర్డ్ ‌ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదం తెలిపినట్టు పాకిస్థాన్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చివరకల్లా తమ దేశంలో టీకాల కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు పాకిస్థాన్ ప్రణాళికశాఖమంత్రి అసద్‌ఉమర్ తెలిపారు. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలతోపాటు 65 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. టీకాల కోసం చైనాతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రత్యేక సహాయకుడు డాక్టర్ ఫైజల్‌సుల్తాన్ తెలిపారు. ఇప్పటివరకు పాక్‌లో 5,19,291 కరోనా కేసులు నమోదు కాగా, 10,951మంది మృతి చెందారు. గత 24 గంటల్లో(ఆదివారం) 2521 కొత్త కేసులు, 43మరణాలు నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News