Tuesday, April 30, 2024

మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

modi trump

 

న్యూఢిల్లీ: తమది బాధ్యతాయుత దేశమని, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేసే విషయంలో చేయగలిగినదంతా చేస్తామని, అయితే ముందుగా తమ దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే ఆ పని చేయగలమని భారత ప్రభుత్వం అమెరికాకు స్పష్టం చేసింది. కరోనా వైరస్ తీవ్రతకు అగ్రరాజ్యమైన అమెరికా చిగురుటాకులా వణికి పోతున్న విషయం తెలిసిందే. అక్కడ లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడంలో రెండు దేశాలు సహకరించడంతో పాటు తాను ఇటీవల భారత్ సందర్శించిన విషయాన్ని గుర్తు చేసిన ట్రంప్ కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని ట్రంప్ ప్రధాని మోడీని అభ్యర్థించారు.

మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. తన అభ్యర్థనకు భారత్‌నుంచి సానుకూల స్పందన వచ్చిందని కూడా ఆయన తెలిపారు. ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని భావిస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో మోడీని హైడ్రోక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశాను’ అని ట్రంప్ తెలిపారు. ఈ మెడిసిన్ కోసం భారత్‌కు అమెరికా ఇప్పటికే ఆర్డర్ అందించిందని, అయితే నిషేధం అమలులో ఉన్నందున సరఫరా జరగడం లేదటు ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా ప్రపంచంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హైడ్రాక్సీ క్లోరోక్విన్ సహా కొన్ని అత్యవసర ఔషధాల ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే మానవతా దృక్పథంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చింది. కాగా కోవిడ్19 చికిత్స విషయంలో మలేరియాను నయం చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అద్భుతంగా పని చేస్తున్నట్లు ట్రంప్ సహా పలు వైద్య సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Give us klorokvin hydroxy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News