Sunday, April 28, 2024

చిరుతపులి దాడిలో మేక మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్: పెద్దశంకరంపేట మండల పరిధిలోని టెంకటి శివారులోని గుట్టల్లో చిరుతపులి మేకపై దాడి చేసి చంపేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా టెంకటి గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. ఈ సమయంలో టెంకటి గ్రామానికి చెందిన ఈడికి నారాయణకు సంబందించిన మేక చిరుతపులి దాడిలో మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పేట అటవీశాఖ అధికారులు ఎఫ్‌ఆర్‌ఓ వికాస్, సెక్షన్ అధికారి నర్సింలు కొండ ప్రాంతంలో పర్యటించగా పాదముద్రలు ఉన్నట్లు గుర్తించామన్నారు. టెంకటి శివారులో సంచరిస్తున్న చిరుతపులిని తొందరగా అటవీశాఖ అధికారులు బంధించాలని మండల బీజేపీ అద్యక్షుడు కోణం విఠల్ పేర్కొన్నారు. చిరుతపులి సంచారంతో ఈ ప్రాంతంలో ప్రజలందరు భయాందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చిరుతపులి దాడిలో చనిపోయిన మేక రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News