Monday, April 29, 2024

కోర మీసాల స్వామికి స్వర్ణ కిరీటం

- Advertisement -
- Advertisement -

Gold crown for Kora Meesala Mallanna Swamy

కొమురెల్లి మల్లన్నకు ఆధ్యాత్మిక ఆభరణం..

సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..

ఆరున్నర కిలోల, రూ.4 కోట్ల తో బంగారు కిరీటం..

కిరీట నమూనా ను ఆవిష్కరించిన మంత్రులు హరిశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి లు..

సిద్దిపేట: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన, తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కోమరవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామికి బంగారు కిరీటం చేపిస్తున్నట్లు మంత్రులు హరిశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు హైదరాబాద్ లో మంత్రులు మలన్న స్వామి కి చేపించే బంగారు కిరీటం నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కొంగు బంగారం, పల్లె జాతర కు పల్లె ప్రజలకు కొంగు బంగారం కోమరెళ్లి మలన్న అని, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆలయాలకు ఆదరణ, అభివృద్ధి పై ప్రభుత్వం పక్షన దృష్టి పెట్టామని, రాష్ట్రంలోని ప్రముఖు పుణ్య క్షేత్రాలను భక్తులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

పురాతన ప్రాచీన ఆలయాలకు గొప్ప ప్రాశస్త్యం తెస్తున్నామని తెలిపారు. అదే తరహాలో కోమరవెళ్లి మల్లన్న ఆలయాన్ని సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా మల్లన్న స్వామి కి 4కోట్ల తో ఆరున్నర కిలోల బంగారు కిరీటాన్ని ప్రభుత్వ పక్షాన చేపిస్తున్నట్లు వెల్లడించారు. కిరీటం తయారు పనులు వేగవంతగా జరుగుతున్నాయన్నారు. వచ్చే రెండు నెలల్లో స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జోన్ ఉప కమీషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News