Wednesday, May 1, 2024

దిగొచ్చిన బంగారం ధర

- Advertisement -
- Advertisement -

ముంబై : వరుసగా వరుసగా పెరుగుతున్న బంగారం ధర గురువారం కొంత దిగొచ్చింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.60,870(24 క్యారెట్)కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.490 తగ్గి రూ.61,020కు చేరింది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో బలహీనత కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం

, గురువారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.452 తగ్గి రూ.60,228కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,169కి చేరుకుంది. వెండి ధర కిలో రూ.817 తగ్గి రూ.70,312కి చేరింది. అంతకుముందు రూ.71,129గా ఉంది. అజయ్ కేడియా ప్రకారం, ఈ ఏడాది బంగారం రూ.62,000కు చేరుకుంటుందని అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితుల్లో అది 64,000కు చేరవచ్చని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News