Saturday, May 11, 2024

బంగారం కొంటున్నారా?.. హెచ్‌యుఐడి నిబంధన గురించి తెలుసుకోండి

- Advertisement -
- Advertisement -

ముంబై : అక్షయ తృతీయ రోజు(ఏప్రిల్ 22) బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ పవిత్రమైన రోజు బంగారాన్ని కొంటే శుభప్రదమని వినియోగదారులు భావిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది.

దీని గురించి ముందుగా తెలుసుకోండి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారిపై చర్య తీసుకోవచ్చు. ఈ కొత్త రూల్ ప్రకారం, తప్పనిసరిగా హెచ్‌యుఐడి ట్యాగ్‌తో బంగారాన్ని విక్రయించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా హెచ్‌యుఐడి ట్యాగ్ లేకుండా బంగారాన్ని విక్రయిస్తే, అది చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. హెచ్‌యుఐడి అనేది హాల్‌మార్క్‌తో ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కల్గివుంటుంది. హెచ్‌యుఐడి ట్యాగ్ అనేది 6 అంకెల సంఖ్య, ఇది ఆల్ఫాన్యూమరిక్ కోడ్ రూపంలో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News