Tuesday, April 30, 2024

‘గుడ్ లక్ సఖి’ థియేటర్స్‌లోనే…

- Advertisement -
- Advertisement -

Good Luck Sakhi movie release in theaters

 

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషించిన ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటించాడు. లక్ష్మి, ధనిక్ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్‌గా ఎలా మారిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే ’గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని కూడా వాయిదా వేయాల్సి వచ్చింది.

అయితే గత కొన్ని రోజులుగా ’గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ చేయబోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పుకార్లపై స్పందించిన నిర్మాతలు సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ‘గుడ్ లక్ సఖి’ సినిమా ఓటీటీలో విడుదల కానుందని వస్తున్న వార్తలు అవాస్తమని.. తమ చిత్రం థియేటర్స్‌లోనే విడుదలవుతుందని తెలియజేశారు. కాగా ’గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మల్టీలాంగ్వేజ్ సినిమాగా రూపొందిస్తున్నారు. దిల్ రాజ్ సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News