Wednesday, May 1, 2024

యువరాజు హ్యారీకి కూతురు

- Advertisement -
- Advertisement -

Harry's wife Meghan Markle gave birth to baby girl

రాణి ఎలిజెబెత్2 శుభాకాంక్షలు

లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఆడ శిశువుకు జన్మనివ్వడం పట్ల రాణి ఎలిజెబెత్2 సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని హాస్పిటల్‌లో మేఘన్ శుక్రవారం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఆ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. దాంతో, రాజ కుటుంబం యువ దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. నవ శిశువుకు లిలీబెట్ డయానా మౌంట్‌బాటన్‌విండ్సర్‌గా నామకరణం చేశారు. ముద్దుపేరుగా లిల్లీ అని పిలువనున్నారు. లిల్లీబెట్ అనేది బ్రిటన్ రాణి ఎలిజెబెత్ ముద్దు పేరు కూడా.

రాణి ఎలిజెబెత్‌కు లిలీ 11వ మునిమనవరాలు. హ్యారీ దంపతులకు ఇప్పటికే రెండేళ్ల కుమారుడు ఆర్కీ హ్యారీసన్ ఉన్నారు. హ్యారీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపినవారిలో హ్యారీ తండ్రి చార్లెస్, సోదరుడు విలియం ఉన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ట్విట్టర్ ద్వారా హ్యారీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. యువరాజు హ్యారీ తల్లి డయానా 1997లో పారిస్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రస్తుతం హ్యారీ దంపతులు బ్రిటన్ రాజకుటుంబం నుంచి విడిపోయి అమెరికాలో ఉంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News