Saturday, May 4, 2024

ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా

- Advertisement -
- Advertisement -

Government issued Rythu Bandhu guidelines

 

ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం
కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే
భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత
రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది జనవరి 23వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలు (డిజిటల్ సైన్) పొందిన రైతులకే 2020 వానాకాలం, యాసంగి రైతుబంధు అందనుంది. జనవరి 23 తరువాత నుంచి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకుంటున్న రైతులు రైతుబంధు పొందాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సంబంధించి రైతుబంధు అమలు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి 23వ తేదీన సిసిఎల్‌ఎ ఇచ్చిన పట్టాదారులకు అ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్‌లకు పెట్టుబడి సాయం అందనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు రైతులంతా నియంత్రిత సాగు పంటలనే వేస్తుండటంతో, అందరికీ రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించారు.

ఆర్‌ఒఎఫ్‌ఆర్ రైతులకు కూడా రైతుబంధు సాయం అందిస్తారు. గుర్తింపు కలిగిన అటవీ హక్కుల చట్టం పట్టదారులను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ అందించిన ఆర్‌ఒఎఫ్‌ఆర్ డేటా ఆధారంగా ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతుబంధుకు రూ.14 వేల కోట్లు కేటాయించింది. ఇందులో వానాకాలం సీజన్‌కు రూ.7 వేల కోట్లు కేటాయించారు. జవవరి 23 వరకు సిసిఎల్‌ఎ ఇచ్చిన వివరాల ప్రకారం కోటి 47 లక్షల 66 వేల ఎకరాల భూమి 59.30 లక్షల మంది రైతులకు ఉంది. అలాగే 92 వేల మంది రైతులకు 2.99 లక్షల ఎకరాల ఆర్‌ఒఎఫ్‌ఆర్ భూమి ఉంది. మొత్తంగా 60.28 లక్షల మంది రైతులకు దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకు పెట్టుబడి సాయానికి రూ.7500 కోట్లు అవసరం అవుతాయి. అయితే బడ్జెట్లో రూ.7 వేల కోట్లు చూపారు.

రైతుబంధు అమలు మార్గదర్శకాలు ఇవే

n పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న 621 మంది పట్టాదారులకు ప్రత్యేక పరిస్థితుల్లో సాయం అందిస్తారు.
n కొత్త పట్టాదారులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులుగా పరిగణిస్తారు.
n రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణనలోకి తీసుకుంటారు
n ప్రతి సీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలిస్తారు. అమ్మిన భూముల వివరాలను రైతుబంధు జాబితాను తొలగిస్తారు. అలాగే వ్యవసాయేతర వాటికి మళ్లిన భూములకు రైతుబంధు ఇవ్వరు. కొత్తగా కొన్న వారికి వచ్చే ఏడాది రైతుబంధు ఇవ్వనున్నారు.

n ఆర్థిక శాఖ దశల వారీగా నిధుల విడుదలో భాగంగా తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ముందుగా చిన్న రైతులకు నిధులు జమ చేస్తారు.
n రైతు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఆధార్ ఆధారంగా గుర్తించి తక్కువ భూమిని పరిగణనలోకి తీసుకుని సాయం అందిస్తారు.
n రైతుబంధు పెట్టుబడి సాయాన్ని వదులుకునే వారు గివ్ ఇట్ ఆప్ ఫారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో సూచించారు. దీనిని క్షేత్రస్థాయిలో ఎఇఒలకు అందించాల్సి ఉంటుంది. గివ్ ఇట్ ఆప్ ద్వారా వచ్చిన మొత్తం రైతుబంధు సమితి ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తారు.

n రైతుబంధు నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మూడేళ్ల నుంచి అమలు చేసున్నట్లు రంగారెడ్డి జిల్లా ట్రెజరీ నుంచి ఈ కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
n రైతుబంధు అమలు పర్యవేక్షణ కమిటీని ప్రభు త్వం నియమించింది. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శి ఛైర్మెన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్, స్టేట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. జిల్లాల్లో రైతుబంధు అమలు కోసం జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
n పెట్టుబడి సొమ్ము జమ చేసిన తరువాత ప్రభుత్వం ఆర్‌బిఐ నిబంధనలకు అనుగుణంగా ఆడిట్ నిర్వహిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News