Sunday, May 12, 2024

గ్రేటర్ విద్యుత్ వ్యవస్థలో మార్పులు

- Advertisement -
- Advertisement -

రూ.10వేల కోట్లతో ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు

TS power utilities reached 13688 MWs demand
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగర జనాబా రోజు రోజుకు పెరుగుతోంది.దాంతో కాలనీలు,బస్తీలు కూడా నలుమూలల విస్తరిస్తు విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అంతే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక జాతీయ,అంతర్జాతీయ పరిశ్రమలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కావడమే కాకుండా మరి కొన్ని పరిశ్రమలను నగరంలో స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. వీటన్నింటికి అంతరాయం లేనివిద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ అధికారులు రూ.10వేల కోట్లతో పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. నగరంలో ఇప్పటికే ఓవర్ హెడ్ లైన్లు ఇళ్ళ మీద నుంచి వెళ్తున్నాయి. ఈదురుగా గాలులతో కూడిన వర్షం కురిసినప్పుడు చెట్లకొమ్మలు విరిగి భారీ,హోర్డింగ్‌లు, వీటిపైప పడటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిస్కం భావిస్తోంది. విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణకు కేంద్రం కొత్తగా తీసుకు వస్తున్న రీ వ్యాంపేడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్కాటర్ స్కీం (ఆర్‌డిఎస్ ) కింద సంస్థకు పెద్ద సంఖ్యలో నిధులు వచ్చే అవకాశం ఉంది.

వీటిని ఉపయోగించి ఎల్‌బినగర్ నుంచి మియాపూర్ వరకు ప్రత్యేక స్ట్రంచ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న ఓవర్‌హెడ్ లైన్లు, కండక్లరు తొలగించి వాటి స్థానంలో కొత్తగా 33 కేవీ,11 కేవీ అండర్ గ్రౌండ్(యుజి), ఎయిర్ బంచ్‌డు( ఏబి) కేబుళ్ళున ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటి కోసం రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 9 సర్కిళ్ళు ఉండగా వీటి పరిదిలో 476 సబ్‌స్టేషన్లు, 1100 ఫీడర్లు ఉన్నాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో 11 కేవీ విద్యుత్ లైను 3 కిలో మీటర్లు విస్తరించి ఉంది. ఈదురు గాలితో కూడిన వర్షాలకు ఉన్న తీగలు మెలిపడి ఉండటమే కాకుండా , చెట్లకొమ్మలపై పడుతూ విద్యుత్ సరపరాకు అంతరాయం కలుగుతోంది. ఇటువంటి సమస్యలకు అధికారులు చెక్‌పెట్టందుకు చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో నగరంలోని విద్యుత్ పంపిణీ వ్యస్థచాలా బలహీనంగా ఉండేది . చిన్న వర్షానికే టిప్పవుతుంటే అధికారులు వాటిని ఆధునీకరించారు.ఐపిడిఎస్‌లో భాగంగా వచ్చిన నిదుల్లో రూ 2908 కోట్లు వ్యయం చేసి పెద్ద సంఖ్యలో కొత్త సబ్‌స్టేషన్ల, యుజికేబుల్స్, ఓవర్‌హెడ్ లైన్స్, ఎల్టీ కేబుల్‌ను లైన్లు వేశారు. 11 కేవీ పాత ఓవర్‌హెడ్ లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్తగా 2678సర్కూట్ కిలో మీటర్లు 33 కేవీలో 61 సర్కూట్ కిలో మీటరు, ఎల్‌టిలైన్లు 4741 సర్కూట్‌లు మార్చడంతో విద్యుత్ అంతరాయాలను అధికారులు చాలా వరకు తగ్గించగలిగారు.

ఐపిడిఎస్ స్కీం కింద ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధిలో 228 సబ్‌స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు (156) పరిధిలో స్కాడా డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్ (డిఎంఎస్)ను ఏర్పాటు చేశారు. సబ్‌స్టేషన్‌ను పరిధిలోని అన్ని ఫీడర్లు అన్నిసర్వర్‌లకు కనెక్టు అవుతాయి.అంతరాయాలను, విద్యుత్ హెచ్చుత్గులను ఆటోమెటిక్‌గా రికార్డు చేసి ఆ సమాచారాన్ని వెంటనే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి చేరవేయడంతో విద్యుత్ సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. గ్రేటర్‌లో ప్రతి10 నుంచి 15శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది.

ముఖ్యంగా కొత్త నిర్మాణాలు, కాలనీలు, అధికంగా ఏర్పాటయ్యే ఇబ్రహీంబాగ్, రాజేంద్రనగర్ ,గచ్చిబౌలీ, సరూర్‌నగర్, షాద్‌నగర్, హబ్సిగూడ, మేడ్చెల్, డివిజన్ల పరిధిలో విద్యుత్ లోడ్ అధికంగా ఉంటోంది.అయితే కొత్త సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి భూ సేకరణ ప్రధాన అడ్డంగా మారింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 152 సబ్‌స్టేషన్‌లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థాన్ని 8 ఎంవి నుంచి 12.5 ఎంవికి పెంచారు. తద్వారా కొత్త సబ్‌స్టేషన్ల పేరుతో సంస్థ చేస్తున్న ఖర్చులను కూడా భారీగా తగ్గించారు.వచ్చే పది సంవత్సరాలలో విద్యుత్ డిమాండ్‌ను బట్టి మిగిలిన సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్దాన్ని కూడా పెంచుతామని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News