Saturday, May 4, 2024

గ్రేటర్ చెరువులకు మహార్ధశ

- Advertisement -
- Advertisement -

చెరువుల అభివృద్ది
అరికట్టడం పనులు


మన తెలంగాణ / సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలో చెరువులు పరిరక్షణతో పాటు వాటీ సుందరకీరణకు జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. జిహెచ్‌ఎంసి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 185 చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని అభివృద్ది చేస్తోంది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 29, మేడ్చల్ 57, రంగారెడ్డి 89, సంగారెడ్డి 10 మొత్తం 185 చెరువులు ఉన్నాయి. వీటి పరిరక్షణకు సంబంధించి ఇప్పటీకే పర్వేను అధికారులు పూర్తి చేశారు. అంతేకాకుండా చెరువుల పూర్తి నీటి సామర్థాన్ని (ఎఫ్‌టిఎల్)ను గుర్తించడం,ఆక్రమణలకు గురి కాకుండా చర్యలను తీసుకుంటున్నారు. 185 చెరువుల ఎఫ్‌టిఎల్ గుర్తింపులో భాగంగా 100 చెరువులకు సంబంధించి ప్రీమిలరీ నోటిఫైడ్ చేశారు. అదేవిధంగా మరో 50 చెరువుకు సంబంధించి నోటిఫైడ్ ప్రక్రియను పూర్తి కాగా, మరో 30 చెరువుకుల సంబంధించి హెచ్‌ఎండిఎ, 5 చెరువులకు సంబంధించి ఎన్‌టిడి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా 10 కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా 10 చెరువులను అభివృద్ది చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి కాలుష్యం భారిన పడిన 19 చెరువులను కాకతీయ మిషన్ కు కింద రూ.279.78 కోట్ల వ్యయంతో పునరుద్దరణ చర్యలు చేపట్టారు. అదేవిధంగా చెరువుల్లో గుర్రపు డెక్క తదితర ఇతర పిచ్చిమొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.ఇందులోభాగంగా రూ.10.51 కోట్ల వ్యయంతో 34 చెరువుల నిర్వహణను చేపట్టారు.

63 చెరువులు అభివృద్ది, సుందకరణకు రూ.94.71 కోట్లు :

గ్రేటర్‌లో ఉన్న 185 చెరువుల్లో 63చెరువులను అభివృద్దితోపాటు సుందరీకరణకు జిహెచ్‌ఎంసి చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి రూ.94.17 కోట్లను నిధులను కేటాయించింది. ఈ నిధులతో జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ నిర్వహణ విభాగం 48 చెరువుల సుందరీకరణ పనులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆక్రమణలను అరికట్టేందుకు చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతోపాటు వాకింగ్ ట్రాక్స్, లైటింగ్, చిన్నారుల ఆట స్థలాల అభివృద్ది తదితర పనులను నిర్వహిస్తున్నారు. ఇందులో 48 చెరువులకు సంబంధించి 55 సివిల్ పనులు చేపట్టగా 21 పూర్తి కాగా, 14 పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక చోట కోర్టు కేసు ఉండగా, 9 ప్రాంతాల్లో భూ వివాదాలు నెలకొన్నాయి. అదేవిధంగా 52 చోట్ల పెన్సింగ్ పనులు కొనసాగుతుండగా ఇందులో 36 పూర్తికాగా, మరో 14 పనులు కొనసాగుతున్నాయి. మరో 2 చోట్ల కోర్టు కేసులు 6 చోట్ల స్థల వివాదాలు ఉన్నాయి. సుందరీకరణలో భాగంగా 53 చోట్ల ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించగా, 1 చోట మాత్రమే పనులు కొనసాగుతుండగా, మిగిలిన 52 చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. లైంటింగ్ పనులకు 41 చోట్ల చేపట్టగా 1 చోట మాత్రమే పురోగతిలో ఉండగా, మిగిలిన 40 చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా గణేష్ నిమజ్జానానికి సంబంధించి రూ.22.89 కోట్లు వ్యయంతో ప్రత్యేక కొలనులు నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటీకే 24 పూర్తి కాగా, స్థల వివాదం కారణంగా పటాన్ చెరులోని సాకి చెరువు పనులు నిలిచిపోగా, మరో చోట పనులు కొనసాగుతున్నాయి.

10 చెరువులను అభివృద్ది చేస్తున్న కార్పొరేట్ సంస్థలు:

కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా గ్రేటర్ పరిధిలోని 10 చెరువులను అభివృద్ది చేస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గం చెరువును రహేజా ఐటి పార్కు అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా 2.20 కిలో మీటర్ల మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను పూర్తి చేయగా, రెండ దశ పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా చెరువు పరిశుభ్ర పనులు పూర్తిగా చెరువులో మురుగు నీరు కలవకుండా చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మల్క చెరువుతో పాటు నలగండ్లలోని పెద్ద చెరువుల అభివృద్దికి సంబంధించి నిధులను అపర్ణ ఇప్రా హౌసింగ్ ప్రై లిమిటెడ్ భరిస్తుండగా చాల మేరకు పనులు పూరైయ్యాయి. ఖాజాగూడలోని పెద్ద చెరువును వెల్స్ ఫార్గో ప్రై లిమిటెడ్ అభివృద్ది చేస్తోంది. కుడి కుంటను షా ఆర్గనైజేషన్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహిస్తుండగా, గచ్చిబౌలిలోని బర్ల కుంటను జెపిమెర్గాన్ కంపెని అభివృద్ది చేస్తోంది. నానక్‌రాంగూడలోని మేడి కుంటను ఫోనిక్స్ కంపెనీ, మూసాపేట్‌లోని కాముని చెరువును సైబర్ సిటీ బిల్డర్, హఫీజ్‌పేట్‌లోని మీది కుంటను ఫౌన్‌ంటైన్ హెడ్ స్కూల్, ఖానన్‌మెట్ లోని మొండి కుంటను హెక్సాగాన్ నిధులను ఖర్చు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News