Friday, April 26, 2024

జిఎస్‌టి వసూళ్లు ఒకె

- Advertisement -
- Advertisement -

GST

 

కేంద్రం నుంచే విడుదల కావట్లేదు
డిసెంబర్‌లో రూ. 2,130కోట్లు వసూలు

హైదరాబాద్ : మాంద్యంలోనూ వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు డిసెంబర్ నెలలో పర్వాలేదనిపించాయి. గడిచిన నెల లో రూ.2130 కోట్ల జిఎస్‌టి వచ్చింది. అంతకు ముందు నెలలో ఈ మొత్తం రూ.4121 కోట్లుగా ఉంది. దాదాపు రూ.2 వేల కోట్లు డిసెంబర్‌లో తగ్గినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన జిఎస్‌టిలో నాలుగో పెద్ద మొత్తంగా ఉండటం గమనార్హం. వాస్తవానికి ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జిఎస్‌టి వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నవంబర్ నెలలోనే అత్యధికంగా రూ.4121 కోట్లు మాత్రం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో జిఎస్‌టి రాబడి రూ.20,348.30 కోట్లకు చేరింది. ఇక డిసెంబర్ నెలలో పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.7369 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే నెలలో రూ.8022.18 కోట్లు వచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం రూ.60,261.78 కోట్లకు చేరింది.

అంటే నిర్దేశించుకున్న మొత్తం వసూళ్ల లక్షం అంచనాల్లో ఇప్పటి వరకు 67.67 శాతం వచ్చాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ టాక్స్, ఎక్సైజ్ డ్యూటిస్ ఆదాయం పెరిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం జిఎస్‌టి వసూళ్లు ఇలాఉ న్నాయి. మొదటి నెల ఏఫ్రిల్‌లో రూ.1573.95 కోట్లు రాగా, రెండో నెల మేలో రూ.1364.47 కోట్లు, జూన్‌లో 3387.93 కోట్లు, జూలైలో రూ.1884.79 కోట్లు, ఆగస్టులో రూ.3427.88 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.1186.26 కోట్లు, అక్టోబర్‌లో రూ.1272 కోట్లు, నవంబర్‌లో రూ.4121 కోట్లు, డిసెంబర్‌లో రూ.2130 కోట్లు వచ్చాయి. కేంద్రం నుంచి జిఎస్‌టి, ఐజిఎస్‌టి ద్వారా ఏకంగా రూ. 3 వేల కోట్లపై నిధులు రావాల్సి ఉంది. వీటి గురించి కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి పెంచుతోంది. లేఖ రాయనున్నట్లు సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు.

పన్ను రూ.2 వేల కోట్లు పెరిగిన పన్ను ఆదాయం
గడిచిన నెల వరకు వచ్చిన పన్నుల రాబడి గత ఏడాదితో చూస్తే దాదాపు రూ.2 వేల కోట్లు పెరిగింది. ఈసారి డిసెంబర్ వరకు ర.60,261 కోట్లు రాగా గతేడాది ఈ మొత్తం రూ.58,304 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా పన్నేతర రాబడి కూడా డిసెంబర్‌లో రూ.246 కోట్లు మాత్రమే వచ్చింది. సాధారణంగా రెవెన్యూ రాబడుల పరిధిలోకి సొంత పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నేతర రాబడి, పెట్టుబడులపై రాబడులు వస్తాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో భాగంగా రాష్ట్రానికి డిసెంబర్ నెలలో రూ.1708.51 కోట్లు వచ్చాయి. ఇక డిసెంబర్ వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.4865.26 కోట్లు ఆదాయం వచ్చింది. సేల్స్ టాక్స్ ద్వారా రూ.14,005 కోట్లు వచ్చింది. స్టేట్ ఎక్సైజ్ డ్యూటిస్ ద్వారా రూ.9032 కోట్లు వచ్చింది.

 

 

GST good collections during month of December
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News