Monday, April 29, 2024

ఈ నెల 26న నేవీలో చేరనున్న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ ఇంఫాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ ఇంఫాల్‌ను మంగళవారం భారత నౌకాదళంలోకి చేర్చుకోనున్నారు. భూతలంనుంచి భూతల లక్షాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణులతో పాటుగా అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు బిగించిన నౌకను మంగళవారం ముంబయి డాక్‌యార్డ్‌లో జరిగే ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా జలప్రవేశం చేయిస్తారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ పేరు పెట్టడం గమనార్హం. ఈశాన్య ప్రాంతానికి చెందిన ఒక నగరం పేరు పెట్టిన తొలి యుద్ధ నౌక ఇదే కావడం విశేషం. ఈ నౌకలో దాదాపు 75 శాతం పరికరాలు భారత్‌లో తయారైనవే ఉండడం విశేషం.

హార్బర్‌లో, సముద్రంలో అన్ని రకాల పరీక్షలను నిర్వహించిన అనంతరం ఈ నౌకను గత అక్టోబర్ 20న భారత నౌకాదళానికి అందజేయడం జరిగింది. నౌకాదళంలోకి చేరిన తర్వాత ఐఎన్‌ఎస్ ఇంఫాల్ పశ్చిమనౌకాదళంలో సేవలందిస్తుంది.ఈ నౌకను ముంబయిలోని మజగాన్ డాక్‌యార్డ్ నిర్మించింది. దేశంలో నిర్మాణమైన డిస్ట్రాయర్ యుద్ధ నౌకలన్నిటిలోకి అతి తక్కువ సమయంలో దీని నిర్మాణం పూర్తయిందని భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. 2017 మే 19న ఈ నౌక నిర్మాణం పనులు ప్రారంభం కాగా 2019 ఏప్రిల్ 20న దీన్ని సమద్ర జలాల్లో ప్రవేశపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News