Tuesday, May 14, 2024

ఎసిలు, కూలర్లు, ఫ్యాన్లు ఇలా వాడండి

- Advertisement -
- Advertisement -

AC

 

వ్యాధుల నివారణకు తగ్గట్టు వాతావరణం
మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: నివాసాలు, పనిచేసే ప్రాంతాలు, ఆరోగ్య రక్షణ సదుపాయాలు కల్పించే చోట్ల ఎయిర్ కండిషనింగ్ (ఎసి), వెంటిలేషన్‌కు సంబంధించి తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజినీర్స్ (ఐఎస్‌హెచ్‌ఆర్‌ఎ ఇ) ఈ మార్గదర్శకాలను తయారుచేసింది. ఆ ప్రకారం ఇంట్లో ఎసి వేసుకుంటే ఉష్ణోగ్రత 24 30 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉష్ణోగ్రతను బట్టి గాలిలో తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) 40 శాతం నుంచి 70 శాతం వరకు ఉంటే వ్యాధుల వల్ల వచ్చే సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ కు మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

ఎయిర్ కండిషనర్లు
+ గది ఉష్ణోగ్రత 24 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య, రిలేటివ్ హ్యుమిడిటీ 40 70 డిగ్రీల మధ్య ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తేమ వాతావరణంలో తేమను తగ్గించేందుకు ఉష్ణోగ్రతను 24 సెంటిగ్రేడ్ డిగ్రీలకి దగ్గరగా, పొడి వాతావరణంలో 30 డిగ్రీలకు దగ్గరగా ఉంచుకోవాలి. గాలి వీయడం పెరిగేందుకు ఫ్యాన్లు వాడాలి.
+ పొడి వాతావరణంలో రిలేటివ్ హ్యుమిడిటీ 40 శాతం కన్నా తగ్గకూడదు. ఒకవేళ తగ్గితే గదిలో ఏర్పాటు చేసిన ప్యాన్ నుంచి ఆవిరయ్యే నీరు తేమను పెంచుతుంది.
+ గదిలో ఉన్న ఎయిర్ కండిషనర్ల నుంచి వచ్చే చల్లటి గాలి బయటి నుంచి వచ్చే గాలితో కలవాలి. అందుకు కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచాలి.
+ ఫ్యాన్ ఫిల్టర్ యూనిట్ సాయంతో బయటి నుంచి వచ్చే తాజా గాలి ద్వారా దుమ్ము లోపలికి రాదు.

ఇవేపరేటివ్ కూలర్లు (బాష్పీభవన కూలర్లు)
+ వీటివల్ల వచ్చే బయటి గాలి వెంటిలేషన్‌కు తోడ్పడుతుంది.
+ఈ కూలర్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అందుకు క్రిమిసంహారాకాలను వాడాలి. తరచు నీటిని తీసేసి, తాజాగా నీటిని పోయాలి.
+ తడి గాలి బయటికి పోయేందుకు కిటికీల్ని తెరిచి ఉంచాలి. పోర్టబుల్ కూలర్లవల్ల బయటిగాలి లోపలికి రాదు. లోపలి తేమతో పాటు చల్లదనం కూడా తగ్గుతుంది కాబట్టి వాటిని సిఫార్సు చేయలేదు.

ఫ్యాన్లు
+ కిటికీలు కాస్త తెరిచి ఉంచి ఫ్యాన్లు వేయాలి.
+ ఒకవేళ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర్లో ఉంటే దాన్ని వేసి ఉంచాలి. అందువల్ల మెరుగైన వెంటిలేషన్ ఉంటుంది.
ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ కొవిడ్ 19 ఇన్‌ఫ్లుయెంజాను గణనీయంగా తగ్గించవచ్చని చైనాలోని 100 పట్టణాల్లో జరిపిన అధ్యయనంలో తేలింది. తక్కువ ఉష్ణోగ్రతలు (7 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్) గాలిద్వారా వ్యాపించే ఈ ఇన్‌ఫ్లుయెంజాకు అనుకూలంగా ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రతల్లో ( 20.5 24 డిగ్రీల సెంటిగ్రేడ్) ఈ వైరస్ ఉనికిని చాలవరకు తగ్గించవచ్చు. అలాగే, 30 డిగ్రీలకు మించి ఉన్నా దీని ఉనికి మరింత తగ్గుతుంది.

 

Guidelines for air conditioning and ventilation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News