Saturday, April 27, 2024

కెటిఆర్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు బిజెపి, కాంగ్రెస్ ప్రయత్నం..

- Advertisement -
- Advertisement -

నల్గొండ: టీఎస్పిఎస్సి పరీక్షల నిర్వహణలో తప్పులు జరిగిన మాట వాస్తవమేనని, ప్రభుత్వం వెంటనే సిట్ వేసి నిందితులను అరెస్టు చేసి భవిష్యత్తు పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంచి విజన్ తో ముందుకు వెళ్తున్నారన్నారు. టీఎస్పిఎస్సి పరీక్షలలో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను సైతం తొలగించారని, నిజాయితీపరుడైన అధికారి జనార్దన్ రెడ్డిని చైర్మన్ గా నియమించారన్నారు. కొందరు స్వార్థంతో చేసిన పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని విపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం మంత్రి కేటీఆర్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వాడుకుంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.

దేశంలో సమర్థ నాయకుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్ ను అబాసుపాలు చేసేందుకు పేపర్ల లీకేజీ వివాదం ఆసరాగా ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ లు బురదజల్లే ప్రయత్నం చేయడం సరైనది కాదన్నారు.
మంత్రిగా ఐటీ రంగాన్ని, మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంతో పాటు గూగుల్, అమెజాన్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాదును విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తూ పరిపాలన దక్షుడిగా గుర్తింపు పొందిన కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక విపక్షాలు నిందారోపణలు చేస్తూ రాజకీయంగా అప్రతిష్ట పాలు చేసే కుట్ర చేస్తున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News