Saturday, May 4, 2024

జ్ఞానవాపి కేసు సుప్రీం పరిధికి

- Advertisement -
- Advertisement -

gyanvapi mosque case latest news

రేపు విచారణ.. సివిల్ కోర్టుకు బ్రేక్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు గురువారం స్పందించింది. సంబంధిత వ్యాజ్యాన్ని తామే (సుప్రీంకోర్టు) శుక్రవారం (నేడు) విచారిస్తుందని, ఈ క్రమంలో వారణాసిలోని సివిల్ కోర్టు దీనిపై తదుపరి విచారణకు దిగరాదని తెలిపింది. ఈ కేసు సివిల్ కోర్టులో అపరిష్క్రతంగానే ఉందని, దీనిని సుప్రీంకోర్టు విచారించాలని హిందూ భక్తుల తరఫున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ త్రిసభ్య ధర్మాసనానికి తెలియచేశారు. శుక్రవారం విచారణకు త్రిసభ్య ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వారణాసిలోని మసీదు కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ తమ వాదన విన్పించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు అనేక మసీదుల మూతకు కోర్టులకు వెళ్లారని, ఇక వారణాసి కేసు విషయంలో హిందూ భక్తులు ప్రహారీ గోడ కూల్చకుండా తగు హామీ కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ దశలో విచారణను తాము చేపడుతున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పుడు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News