Sunday, May 5, 2024

బర్త్‌డేకి టీజర్

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎప్పుడు కనిపించని విధంగా ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడు కూడా చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా చేయని పవన్ మొదటి సారి క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక విభిన్నమైన నేపథ్యంలో ఆయన నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ‘హరి హర వీరమల్లు’ నుంచి చిన్న వీడియో వచ్చి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

ఇక ఈ సినిమా నుండి మరిన్ని సర్‌ప్రైజ్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ బర్త్ డే సందర్భగా టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక ఆగస్టులో నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తారని సమాచారం. ప్రతి సందర్భానికి తగ్గట్లుగా క్రిష్ ఏదో ఒక పోస్ట్ లేదా టీజర్, వీడియో ఇలా విడుదల చేస్తూ అన్ని వర్గాల వారిలో సినిమాపై అంచనాలు పెంచేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్‌ను ఈ సినిమాలో క్రిష్ దొంగగా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే తెలిసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా నటింపజేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమా నుండి వన్ బై వన్ టీజర్.. పోస్టర్.. మేకింగ్ వీడియో అంటూ వస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News