Monday, April 29, 2024

ఒంటరి మహిళపై వేధింపులు

- Advertisement -
- Advertisement -

చుంచుపల్లి : హక్కుగా ఉన్న ఇంటిని కబ్జా చేసేందుకు ఒంటరిగా ఉన్న మహిళను వేధిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ ఎన్‌ఎఫ్‌ఐడబ్లు మహిళా సమాఖ్య నాయకురాలు కరీష రత్నకుమారి డిమాం డ్ చేశారు. బాధితురాలు బొల్ల ప్రగడ వీర వెంకట భానుశ్రీ వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ పంచాయతీలో ఉన్న ఇంటి నెంబర్ 3-2-186/2ను కబ్జా చేసేందుకు తన పక్క ఇంటివారు మానసికంగా బాగా వేధిస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు.

బాధిత మహిళా తండ్రి చిన్నప్పుడే మరణించడంతో వారి అమ్మ మానిక్యాంబ, పెద్దమ్మ ప్రహరాజు మంగలాంబలు తనను పెంచారని వారు కూడా మధ్యలోనే కాలం చెల్లించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నుంచి 2014 వరకు తన తల్లి పేరు ఉన్న ఇంటికి పనున్నలు చెల్లిస్తున్నామని వారి మరణానంతరం బాధిత వారసత్వ మహిళా పేరుపై ఇంటి పన్నులు మార్చడమనేది ఆనాటి నుంచి నేటి వరకు బాధితురాలు పన్ను చెల్లిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ పెద్దలు మరణించిన తరువాత ఒంటరిగా ఉన్న తనను పక్క ఇంటి వారు చెబియ్యం రామకృష్ణ ప్రసాద్ శాస్త్రీ, పవన్, రాహుల్ కుటుంబ సభ్యులు తన ఇంటిని వారికే అమ్మాలని లేకుంటే ని సంగతి చూస్తామంటూ వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులు పెట్టేవారని ఆరోపించారు.

వారి ఇబ్బందులకు తాళలేక బాబాయి ఇంటి వద్ద ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక పంచాయతీ అధికారులు,ప్రజాప్రతినిధులు బాధిత మహిళా వద్ద ఉన్న ఆధారాలు చూసి ఈ ఇంటికి హక్కు దారులు తానే అని చెప్పిన పోలీస్ అధికారులదే తుది నిర్ణయం తన ఇంటికి తాళం వేసి మరీ బెదిరిస్తున్నారని మహాళా తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతధికారుల దృష్టికి తీసుకువెళ్ళడమే కాకుండా బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News