Saturday, April 27, 2024

ఇన్‌స్టాలో యువతులకు వేధింపులు

- Advertisement -
- Advertisement -

Harassment of young womens in Instagram

నగ్న చిత్రాలు పంపించాలని బ్లాక్‌మేయిల్
బాధితురాలి ఫిర్యాదు…. నిందితుడి అరెస్టు

హైదరాబాద్: యువతి పేరుతో ఇన్‌స్టాగ్రాంలో ఖాతా తెరిచి పలువురు యువతులను బ్లాక్‌మెయిల్ చేసిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. వరంగల్ జిల్లా, పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ ఇంజనీరింగ్ చేసి నగరంలోని దిల్‌సుక్‌నగర్‌లో ఉంటూ మల్టీమీడియా కోర్సు నేర్చుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిగా పలువురికి రిక్వెస్ట్‌లు పంపించాడు. యువకుడిని యువతిగా భావించిన పలువురు తమ ఫొటోలు పంపించారు. అప్పటి నుంచి యువతులను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

తాను యువకుడినని, తనకు మీ నగ్న చిత్రాలు పంపించాలని లేకుండా మీరు పంపించిన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాని బెదిరించడం ప్రారంభించాడు. దీనికి భయభ్రాంతులకు గురైన కొందరు యువతులు తమ నగ్న ఫొటోలు పంపించారు. వాటిని అడ్డుపెట్టుకుని తన కోరిక తీర్చాలని లేకుంటే సోషల్ మీడియలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు. ఇలా దాదాపుగా 200మంది బాధితులను అజయ్ బెదిరించినట్లు తెలిసింది. నిందితుడి బాధితురాలు 15 రోజుల క్రితం నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని దిల్‌సుఖ్‌నగర్‌లో అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News