Tuesday, April 30, 2024

సిపిఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిపిఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చని కార్డియాక్ అరెస్టుతో స్పృహ కోల్పోయిన వ్యక్తులను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సిపిఆర్ విధానం ఎంతో అవసరం పడుతుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశ వ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహన ఉన్నదని, సీపీఆర్ నేర్చుకుని ప్రతి ప్రాణాన్ని కాపాడదామని హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిపిఆర్ పై అవగాహన కార్యక్రమంలో హరీష్ మాట్లాడారు.

గుండెపోటు అనేది ఆత్మీయులు, కుటుంబ సభ్యులకు వస్తే ఎంతో బాధ పడతామని, అందుకే సిపిఆర్ నేర్చుకోవడం చాలా అవసరమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 15 లక్షల మంది చనిపోతున్నారని వివరించారు. రాష్ట్రంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 4 వేల మంది చనిపోతున్నారని, దేశ వ్యాప్తంగా రెండు శాతం మందికి మాత్రమే సిపిఆర్ పై అవగాహన ఉందని, అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశించి ప్రభుత్వం సిపిఆర్ శిక్షణ కార్యక్రమం చేపట్టిందన్నారు. సిపిఆర్ పై రాష్ట్ర వ్యాప్తంగా 18, 850 మందికి ఇప్పటి వరకు శిక్షణ అందించామని, అందరూ నేర్చుకుంటే ప్రతి విలువైన ప్రాణాన్ని కాపాడవచన్నారు.

హార్ట్ఎటాక్ వేరు సడన్ కార్డియాక్ అరెస్ట్ వేర్వేరుగా ఉంటాయని పలు ఉదాహరణలుగా ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వివరించారు. కార్డియాక్ అరెస్ట్ అనేది శ్వాస ఆడకపోవడం, పల్స్ లేకపోవడం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రూ.15 కోట్లతో ఎఇడి మిషనరీలు తెచ్చి ఆసుపత్రులలో అందుబాటులోకి తీసుకవచ్చామని, సిపిఆర్ నేర్చుకుని సిద్దిపేటలో ప్రతి విలువైన మనుషుల ప్రాణాన్ని కాపాడుదామని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ నెల 13న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ కు శంఖుస్థాపన, తర్వాత మెదక్ జిల్లాలో పోలీసు కన్వెన్షన్ సెంటరు ప్రారంభం చేస్తమన్నారు.

సిద్ధిపేట జిల్లా తరహాలోనే పోలీస్ హెల్త్ ప్రోఫైల్ మిగతా అన్నీ జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, గిడ్డంగి కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, పోలీసు కమిషనర్ శ్వేత, డిఎంహెచ్ఒ డాక్టర్ కాశీనాథ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News