Monday, April 29, 2024

రాహుల్‌కు ఓ మంచి పిల్లను చూసి పెట్టరాదుండి …

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హర్యానాలోని సోనిపట్‌లోని మదీనా గ్రామం ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతుల పంటపొలాల్లోకి వెళ్లి, ట్రాక్టర్ నడపడం, రైతుకూలీలతో కలిసి నాట్లు వేయడంలో తీరిక లేకుండా ఉన్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ దశలో కొందరు మహిళలు ఎప్పుడూ మా చేతి వంట తినడమే కానీ మీ ఇంటికి పిలిచేది లేదా అని గద్దించడంతో , రాహుల్ తనకు సొంత ఇల్లు లేదని, ఉన్న ఇల్లు సర్కారులాగేసుకుందని,తానే తల్లి సోనియా ఇంట్లో, సోదరి ప్రియాంక ఇంట్లో ఉంటూ వస్తున్నానని, వారి వద్దకు తీసుకువెళ్లుతానని తెలిపి, వీరిని ఢిల్లీలోని సోనియా నివాసానికి వ్యాన్‌లో తీసుకువెళ్లారు. అక్కడ సోనియా, ప్రియాంకలతో రైతమ్మల మాటామంతీ సాగింది.
హర్యానా రైతమ్మ ః రాహుల్‌జీకి వయస్పు మీదబడుతున్నది కదా. ఇంకా ఎప్పుడు షాదీ చేస్తారు? పిల్లను చూసి పెళ్లి చేసేయరాదుండి..
సోనియా ః చూస్తూనే ఉన్నమమ్మా. సరిగ్గా కుదరడం లేదు. పోనీ నువ్వే ఓ పిల్లను చూడరాదు , మా వాడికి ఇచ్చి కట్టబెడుదాం. ఓ మంచి పని అయిపోతుంది.
రైతమ్మ ః చూడమంటే చూస్తం, పెళ్లికి మెప్పిస్తరా? ఇంకా పెళ్లికాకుండా ఎన్ని రోజులు ఈ కథ?
సోనియా ః మా వాడికి పల్లెపట్టు, రైతులు పొలాలు పంటలంటే ఇష్టం. మీ దగ్గరనే ఓ సంబంధం ఉంటే చెప్పరాదుండి, చేసేద్దాం ..
రైతుకూలీ ః భర్తను ఉన్నట్లుండి పోగొట్టుకున్నప్పుడు ఏమన్పించింది. రాజీవ్ గాంధీజి దూరం అవడంతీరని బాధ కదా? అని ప్రశ్నించగా ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఏమి మాట్లాడలేకపొయ్యారు. ప్రియాంక కలుగచేసుకుని ఇది తమ కుటుంబంలో బాధాకర ఘట్టం అని, అమ్మ మూడు నాలుగు రోజులు నీళ్లు కూడా ముట్టలేదని తెలిపారు. ప్రియాంక ఈ విషయం చెపుతున్నప్పుడు సోనియా కన్నీటి పర్యంతరమయ్యారు. తరువాత తేరుకుని వారితో సంతోషంగా మాట్లాడారు. ఆ తరువాత ప్రాంగణంలో వారితో కలిసి పదం కదిపి అడుగులేశారు. ఈ విధంగా తన తల్లితో సాగిన మాటామంతీని రాహుల్ తరువాత ఫోటోలతో పాటు వెలుగులోకి తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన కలాకపటం తెలియని రైతక్కలతో ,

అమ్మలతో మొత్తానికి ఈ విధంగా తన సోదరి ప్రియాంక ఇల్లు కళకళలాడిందని, వారితోపలు విషయాలు చర్చించామని, తిండి, పంటలు, మహిళలు స్వశక్తితో ముందుకు సాగడం, జిఎస్‌టి ఇతర పన్నుల విషయాలు గురించి కూడా వారితో తాము ముగ్గురం మాట్లాడినట్లు రాహుల్ తెలిపారు. తన పెళ్లి గురించి వారు తల్లి సోనియాను నిలదీసినట్లు మాట్లాడటం తనకు ఆనందం కల్గించిందన్నారు. వారితో ప్రియాంక ఇంట్లో తల్లితో కలిసి విందారగించడం తనకు చెదిరిపోని యాదీ అవుతుందన్నారు. ఊర్ల నుంచి వచ్చిన వారి నుంచి తమకు వెలకట్టలేని పలు కానుకలు దక్కాయని , ఇక ముచ్చట్లే ముచ్చట్లని తెలిపారు. రైతు కూలీలు వట్టి చేతులతో రాలేదని తమకు దేశీ నెయ్యి, తియ్యటి లస్సీ, ఇంటి పచ్చళ్లు, మొక్కజొన్న కంకులు తీసుకువచ్చారని వివరించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే వారు చూపిన ప్రేమ, అభిమానం లెక్కించలేనంత అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News