Saturday, April 27, 2024

పేదల కోసమే ఆరోగ్య శిబిరం

- Advertisement -
- Advertisement -

Health Camp for the Poor Says CP Anjani Kumar

హెచ్‌సిఎస్‌సి, నగర పోలీస్, విన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం
పాల్గొన్నా హైదరాబాద్ సిపి అంజనీకుమార్

హైదరాబాద్: పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. హెచ్‌సిఎస్‌సి, నగర పోలీస్, విన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బేగంపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ పేదరికంతో వైద్యం చేయించుకోలేని వారి కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. అందరు ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అందరికీ తెలియజెప్పేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన 400మంది స్థానికులకు ఫిజీషియన్, పల్మనాలజిస్టు, గైనకాలజిస్టు పరీక్షలు చేశారు. కార్యక్రమంలో నార్త్‌జోన్ డిసిపి కల్మేశ్వర్, హెచ్‌సిఎస్‌సి సెక్రటరీ జనరల్ చుక్కపల్లి అవినాష్, నాగరాజు, విన్ ఆస్పత్రి, అడ్వైజర్ డైరెక్టర్, హెచ్‌సిఎస్‌సి ట్రాఫిక్ ఫోరం జాయింట్ డైరెక్టర్ పియూష్ అగర్వాల్, అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News