Friday, April 26, 2024

భారీగా పంట నష్టం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాసంగిలో అకాల వర్షాలు వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటనష్టాలకు సంబంధించిన సర్వే గడువు శుక్రవారం నాటితో ముగిసిపోయింది. అన్ని జిల్లాల నుంచి నష్టాలకు సంబంధించిన నివే దికలు అందుతున్నాయని, తుది నివేదిక సిద్దమ య్యేందుకు మరో రెండు మూడు రోజులు సమ యం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రా థమిక సమాచారాన్ని బట్టి రాష్ట్రంలో అకాల వ ర్షాల వల్ల దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 15లక్షల ఎకరాల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. 30శాతం పైన దెబ్బతిన్న పైర్లను ప్రతిపాదికగా తీసుకొని ఈ అంచనాకు వచ్చారు. వడపోతల అనంతరం పం టనష్టపు విస్తీర్ణం ఎంతకు తగ్గుతుందన్నది నిర్ధారించాల్సివుంది. చాల చోట్ల అకాల వర్షాల వల్ల వరి పైరు దెబ్బతింది. వడగండ్ల వర్షం పడ్డ ప్రాంతాల్లోనే పైరుమీద ఉన్న గింజలు నేలరాలా యి. నష్టం పూర్తి స్థాయిలో జరిగినట్టు చెబుతు న్నారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటనష్టాలు 50వేల ఎకరాలలోపే ఉన్నట్టు అధికారుల సమా చారాన్ని బట్టి తెలుస్తోంది.

పంట పొలం సర్వే నెంబరు, సాగు చేసిన పంట రకం , రైతుపేరు , పంట నష్టపు శాతం , విస్తీర్ణం , రైతు బ్యాంకు ఖా తా తదితర వివరాలతో పంటనష్టపు సర్వే నివేది కలు రూపొందించారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, డిజిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో అంచె లంచెలుగా నివేదికలు రూపొందాయి. అన్ని జిల్లా ల నుంచి వచ్చిన నివేదికలను విశ్లేషణ చేసి రాష్ట్ర స్థాయిలో తుది నివేదిక సిద్ధం చేయాల్సిఉందని అధికారులు వెల్లడించారు. అందులో కూడా వరి, మొక్కజొన్న, శనగ, మినుము, పెసర తదితర పం టల విస్తీర్ణం నష్టపు శాతం , వాటి విలువ తదితర అంశాలతో నివేదిక రూపొందించాల్సి ఉ ద్యాన పంటలకు సంబంధించి ప్రత్యేక నివేదిక రూపొందిస్తున్నారు. అకాల వర్షాలు వడగండ్ల వానలతో ఉద్యాన రంగానికి జరిగిన నష్టంలో మామిడి తోటలకే ఎక్కువ  జరిగింది. కాపుమీద ఉన్న దశలో జరిగిన నష్టాన్ని ఏవిధంగా లెక్కించారన్నద్ది తెలియాల్సివుంది.

ప్రాథమిక సమాచారం మేరకు 30వేల ఎకరాల్ల మామిడి తోటలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. మిరప పంటలకు కూడ నస్టం వాటిల్లింది. అయితే ఈ నష్టం ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా చెప్పలేమని రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కూరగాయ పంటలకు కూడా నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి నివేదికలు అందాకే అన్ని అంశాలను విశ్లేషించి సమగ్ర వివరాలతో తుది నివేదికను సిద్దం చేసి ప్రభుతానికి అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News