Saturday, May 4, 2024

వరద జలాలతో జంట జలాశయాల్లో పెరిగిన పూడిక

- Advertisement -
- Advertisement -
Heavy flood waters in Osman Sagar and Himayat Sagar
సమీప ప్రాంతాల నుంచి మట్టి, చెత్త చెదారం ప్రాజెక్టులోకి
ఏటా రెండు అడుగుల వరకు పేరుకపోతున్న మట్టి
పూడికతీత పనులు చేపడితే మరో రెండు టిఎంసీలు నీరు నిల్వ
ముందుగా అక్రమ నిర్మాణాలు తొలగించాలంటున్న స్థానికులు

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి తాగు నీటి జలాలు అందించే జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులు గత రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పొట్తెడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మట్టి కొట్టుక రావడంతో ప్రాజెక్టుల సామర్ద్యం తగ్గుతుందని, దీంతో వచ్చిన జలాలు వచ్చినట్లే దిగువ మూసీకి వచ్చే పరిస్దితి నెలకొంది. రెండు నెల వ్యవధిలో మూడు రోజులు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. గంట పాటు వర్షం కురిస్తే వెంటనే జలమండలి అధికారులు గేట్ల వద్ద కాపలా ఉంటున్నారు. ఈప్రాజెక్టులోకి 50నుంచి 60కిమీ మేర నుంచి నీటి వరద రావడంతో మట్టి పెద్ద ఎత్తున తరలిరావడంతో, గతంలో ఉన్న దానికంటే మూడు అడుగుల వరకు మట్టి పేరుకపోయిందని వాటర్‌బోర్డు సిబ్బంది పేర్కొంటున్నారు. వైఎస్ హయాంలో పనికి ఆహార పథకం కింద సమీప రైతులు పొలాలకు మట్టి తీసుకెళ్లడంతో అప్పట్లో కొద్ది చెరువులు సామర్దం పెరిగింది.

తరువాత వర్షాలు మోతాదుగా కురువడం జలాశయాలు ఆశించిన స్దాయిలో నీరు రాలేదు. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు కబ్జాకోరులుగా అవతారమెత్తి ప్రాజెక్టులకు చెందిన భూములను అక్రమించుకుని దర్జాగా బహుళ అంతస్తులు నిర్మాణాలు చేయడంతో చెరువులు వైశాల్యం తగ్గిపోయింది. చుట్టు పక్కల భూములన్ని పూర్తిగా ఫాంహౌజ్‌లుగా మారడంతో జలాశయాల నుంచి మట్టి తీసుకపోయేవారు లేకుండా పోయారు. దీంతో వరద వచ్చినప్పడుల్లా మట్టి పెరుగుతుందంటున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్దాయి నీటి మట్టం 1763.50 అడుగులుండగా, ప్రస్తుత నీటి స్దాయి 1763.50 అడుగులు, రిజర్వాయర్ పూర్తి సామర్దం 2.97 టిఎంసీలు ఉండగా, ప్రస్తుతం సామర్దం 2.97 టిఎంసీలు, అదే విధంగా ఉస్మాన్‌సాగర్ పూర్తి స్దాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటి స్దాయి 1790 అడుగులు, రిజర్వాయర్ పూర్తి నీటి సామర్దం 3.90టిఎంసీలు, ప్రస్తుతం నీటి సామర్దం 3.900 టిఎంసీలు ఉంది. ప్రభుత్వం జంటజలాశయాల్లో పూడికతీత పనులు చేపట్టి, మట్టి తొలగిస్తే మరో నాలుగు అడుగులు లోతు పెరుగుతుందని, అదే విధంగా నీటి సామర్దం పెరగడంతో పాటు, మరో రెండు టిఎంసీల వరకు నీటి నిల్వలు పెరుగుతాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. పూడిక మట్టి తీస్తే భూమిలోకి నీరు ఇంకడంతో సమీపంలో 10 కిమీ మేరకు భూగర్బజలాలు పుష్కలంగా ఉంటాయని వివరిస్తున్నారు. వేసవికాలంలో పూడికతీత పనులు చేపట్టి, కబ్జా చేసిన చెరువుల భూములు స్వాదీనం చేసుకోవాలని స్దానిక ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News