Tuesday, May 14, 2024

ఢిల్లీని ముంచెత్తుతున్న వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rains cause waterlogging across Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. 24 గంటలో 138.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతమని భారత వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. భారీ వర్షంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరు చేరడంతో మోటార్లతో అధికారులు వరద నీరు తొలగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సఫ్ద్దర్‌గంజ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2.30 నుంచి 5.30 గంటల వరకు 73.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు వారాలపాటు ఇదేవిధంగా వానలు కురుస్తాయని వెల్లడించింది.

Heavy rains cause waterlogging across Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News