Monday, April 29, 2024

100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల

- Advertisement -
- Advertisement -
Taliban released 100 Pakistani terrorists
జైళ్ల నుంచి ముష్కర మూకలకు స్వేచ్ఛ కల్పించిన తాలిబన్లు

కాబూల్ : అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాలిబన్లు క్రమంగా తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడడమే కాకుండా జైళ్లలో ఉన్న నేరగాళ్లు, ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పిస్తున్నారు. తాజాగా, అఫ్ఘాన్ జైళ్లలో ఉన్న 100 మంది పాకిస్తానీ ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. విడుదలైన వారిలో తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్(టిటిపి) ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు కూడా ఉన్నారు. రిలీజ్ అయిన వారిలో టిటిపి మాజీ డిప్యూటీ చీఫ్ మౌల్వీ ఫకిర్ మొహ్మద్ వంటి అగ్ర నేతలు ఉన్నట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి.

వీరితోపాటు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను కూడా జైలు నుంచి విడుదల చేసినట్టు తెలిపాయి. ఈ ఉగ్రవాదులు జైళ్ల నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే తిరిగి ఉగ్రవాద సంస్థలో చేరారు. అల్ ఖైదా నుంచి తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్తాన్‌కు సైద్ధాంతిక మార్గదర్శనం కొనసాగుతోంది. టిటిపి అంటే పాకిస్తాన్‌కు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే, పాక్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చడమే టిటిపి లక్ష్యం. ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్‌లో పలుసార్లు విధ్వంసాలకు పాల్పడింది. పాకిస్థాన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడం.. అల్-ఖైదా నుంచి సైద్ధాంతిక మార్గదర్శకత్వం పొందడమే లక్ష్యంగా ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అఫ్ఘాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలకు చెందినవారిని ఈ సంస్థ రిక్రూట్ చేసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News