Friday, April 26, 2024

కేరళలో ఎడతెరిపిలేని వర్షాలు

- Advertisement -
- Advertisement -
Heavy rains continued to lash Kerala
ఇద్దరు మృతి, 10 జిల్లాల్లో అలర్ట్

తిరువనంతపురం: కేరళలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణశాఖ(ఐఎండి) సోమవారం పది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజుల్లో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 2,3 రోజుల్లో వాయువ్య పశ్చిమదిశగా ప్రయాణించనున్నట్టు ఐఎండి అంచనా వేసింది. కుందల,కుల్లార్‌కుట్టి, మలంకర, పోన్‌ముడి రిజర్వాయర్ల గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు.

దాంతో, పెరియార్, ముత్తిరపూజ, మువ్వట్టుపూజ నదులు పొంగనున్నాయి. ఆదివారం తిరువనంతపురంలో ఒకరు విద్యుత్ తీగ తగిలి చనిపోయినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షం, గాలుల తీవ్రత వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు తెలిపారు. సోమవారం ఉదయం కాసరగోడ్‌లో ఒకరు చనిపోయారు. సోమవారం ఉదయానికి 24 గంటల్లో కేరళలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 4555కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Heavy rains continued to lash Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News