Tuesday, April 30, 2024

ఉత్తరాఖండ్ ఆదికైలాస్ శిఖరానికి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ జిల్లా నైనిసైని విమానాశ్రయం నుంచి ఆదికైలాస్, ఓం పర్వత్ శిఖరాలకు సోమవారం నుంచి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమైంది. జాయింట్ మేజిస్ట్రేట్ ఆశిష్ మిశ్రా ఈ సర్వీస్‌ను ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ హెలి దర్శన స్కీం కింద ఎం1 19 హెలికాప్టర్ యాత్రికులను విమానాశ్రయం నుంచి వ్యాస్ వ్యాలీ రీజియన్ లోని ఆదికైలాస్, ఓం పర్వత్ శిఖరాలకు తీసుకెళ్తుంది. ఆ శిఖరాలపై విహరించిన తరువాత తిరిగి యాత్రికులను విమానాశ్రయానికి చేరుస్తుంది. రెండు గంటల పాటు సాగే ఈ పర్యటనకు ఒక్కొక్కరికి జిఎస్‌టితో కలుపుకుని రూ. 40,000 ఛార్జి చేస్తారు. స్కై వన్ వేస్ ఈ సర్వీస్‌ను నడుపుతుందని జిల్లా పర్యాటక అధికారి క్రీతి చంద్ర ఆర్య చెప్పారు.

ఈ సర్వీస్ ప్రారంభంలో 19 మంది పర్యటించారు. సమయానుకూలంగా ఈ స్కీమ్ ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్టు ఆర్య తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే నెల నుంచి వారానికి అయిదు రోజులు ఈ సర్వీస్ అందుబాటు లోకి వస్తుందన్నారు. రాష్ట్రానికి ఇదో సాధన అని, ఆదికైలాస్ రీజియన్ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ఆదికైలాస్ శిఖరంపై జోలింగ్‌కాంగ్‌ను సందర్శించడంతో భక్తులకు అది ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందడం ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News