Friday, May 10, 2024

ఏప్రిల్ 12 నుంచి ‘పాగల్’ లవ్ యాత్ర

- Advertisement -
- Advertisement -

Hero Vishwak sen Birthday celebration

 

విశ్వక్‌సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పాగల్’. మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే హీరో విశ్వక్‌సేన్ బర్త్‌డేను సినిమా టీమ్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఈ ఈవెంట్‌లో బెక్కం వేణుగోపాల్, హీరో తేజ సజ్జా, హీరోయిన్లు మేఘ లేఖ, సిమ్రన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ “ఈ సినిమా మీద నాకెంతో నమ్మకం ఉంది. సినిమా బాగా వచ్చింది. ఎవరితో ఎంత బెట్ వేసుకుంటారో వేసుకోండి. ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఇక ‘పాగల్’ సినిమాలో 1600 మంది అమ్మాయిలను లవ్ చేశాను. అది కూడా సరిపోలేదు. పాగల్ లవ్ యాత్రను ఏప్రిల్ 12 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతంలో చేపడతాము” అని అన్నారు. మేఘలేఖ మాట్లాడుతూ “విశ్వక్ సేన్ హీరోనే కాదు డైరెక్టర్ అని కూడా తెలుసు. విశ్వక్ సేన్ స్క్రీన్ మీద కోప్పడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఆయన ప్రేమిస్తే.. మీరు ఖచ్చితంగా ఆయన ప్రేమలో పడతారు.. ప్రేమిస్తారు” అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News