Thursday, May 9, 2024

పక్కింటి అమ్మాయి పాత్రలో నటించా

- Advertisement -
- Advertisement -

Heroine Vaishali Raj interview

 

సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’. బాలరాజు.ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్‌లపై సాగర్ మంచనూర్, సతీష్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్, దేవీప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ వైశాలి రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “హీరోయిన్‌గా ‘కనబడుటలేదు’ నా తొలి చిత్రం. నా స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్ అయితే నా అసలు పేరు కవిత. మాది వైజాగ్. పుట్టి పెరిగింది, చదువువంతా వైజాగ్‌లోనే సాగింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో సునీల్ మెయిన్ రోల్ చేశారు. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. నా పాత్ర చుట్టూనే ఈ సినిమా రన్ అవుతుంది. ఇందులో మిడిల్ క్లాస్ పక్కింటి అమ్మాయి పాత్రలో నటించాను. నా పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇక ప్రస్తుతం కొన్ని స్టోరీస్ వింటున్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత అవి ఫైనల్ అవుతాయి. నాకు దీపికా పదుకునే, నయనతార, సమంత అంటే చాలా ఇష్టం. వాళ్లు ఎంపిక చేసుకునే రోల్స్ బాగా నచ్చుతాయి”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News